Let's talk: editor@tmv.in
ఏపీలో ‘ఎస్‌ఐఆర్‌’ క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు పొడిగింపు

ఏపీలో ‘ఎస్‌ఐఆర్‌’ క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు పొడిగింపు

Gaddamidi Naveen
3 సెప్టెంబర్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం గడువును పొడిగించింది. సెప్టెంబర్ 10, 2026 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ మంగళవారం వెల్లడించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఉన్న గడువును మరో 11 రోజులు పొడిగించినట్లు తెలిపారు. జూలై 1, 2026ను అర్హత తేదీగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్‌ కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నోటీసుల జారీ, వాటి పరిష్కార ప్రక్రియ గడువును కూడా అక్టోబర్‌ 5 వరకు పొడిగించారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని అక్టోబర్‌ 9, 2026గా సవరించినట్లు వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఈ పొడిగింపుతో అర్హత ఉన్న ఓటర్లు తమ పేర్లను జాబితాలో చేర్చుకునేందుకు మరో అవకాశం లభించింది.