
ఏపి లో 102 ఇంధనప్రాజెక్టులు మంజూరు - సిఎస్ కె.విజయానంద్
అమరావతి సచివాలయంలో రెండు రోజులుగా జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగస్వామ్య సదస్సు 2025 కు ముందు వరకు ఇంధన శాఖకు వచ్చిన పెట్టుబడుల గురించి ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిఎస్ కె.విజయానంద్ ప్రెజెంటేషన్ ఇస్తూ… సిఐఐ సదస్సుకు ముందు ఇంధన శాఖకు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజి, హైడ్రోజన్, రూప్ టాఫ్ సోలార్ ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి 102 ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని వివరించారు. వాటిలో ఇప్పటికే 21 ప్రాజెక్టులు గ్రౌండ్ కాగా మరో 16 ప్రాజెక్టులకు భూమి కేటాయింపు పూర్తయిందని చెప్పారు. మరో 45 ప్రాజెక్టులకు భూసేకరణ ప్రోసెస్ లో ఉందన్నారు. మిగతా 20 ప్రాజెక్టులు డిపిఆర్, పీజిబిలిటీ స్టడీ దశలో ఉన్నట్టు సిఎస్ పేర్కొన్నారు.
మొత్తం ప్రాజెక్టుల విలువ 6 లక్షల 4వేల కోట్ల రూపాయలని అన్నారు. వాటిలో 18వేల 394 మెగావాట్ల విండ్, 31వేల 944 మెగావాట్ల సోలార్ విద్యుత్, మరో 36వేల 210 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ కు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు.
ఈ ప్రాజెక్టులకు మొత్తం 6 లక్షల 85వేల ఎకరాల భూమి కావాల్సి ఉండగా దానిలో లక్షా 47వేల 339 ఎకరాలు రెవెన్యూ భూమి కావాల్సి ఉండగా ఇప్పటికే 38వేల ఎకరాలను కేటాయించారని మిగతా భూమిని కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. మిగతా కావాల్సిన భూమిని లీజు ప్రాతిపదికన నెడ్క్యాప్ ద్వారా తీసుకోవాల్సి ఉందని అన్నారు.
కాగా ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఇంధన శాఖకు సంబంధించి 50 ప్రాజెక్టులకు అవగాహనా ఒప్పందాలు చేసుకోవడం జరిగిందని విజయానంద్ పేర్కొన్నారు. ఈఎంఓయుల మొత్తం విలువ 4 లక్షల 54 వేల కోట్ల రూపాయలు కాగా 2 లక్షల 48 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఈప్రొజెక్టులన్నీ 45 రోజుల్లోగా గ్రౌండింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని కావున జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.
