Let's talk: editor@tmv.in
ఏపి జీఎస్టి వసూళ్లలో జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావం

ఏపి జీఎస్టి వసూళ్లలో జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావం

Dantu Vijaya Lakshmi Prasanna
3 డిసెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. 2025 నవంబర్ వరకు నికర జీఎస్టి వసూళ్లలో 5.80% వృద్ధిని నమోదు చేసింది . అయితే, జీఎస్టి 2.0 రేటు తగ్గింపులు, మోంతా తుపాను ప్రభావంతో నవంబర్ నెలలో ₹2,697 కోట్లకే జీఎస్టీ వసూళ్లు పరిమితమై, 4.60% తగ్గాయని చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ బాబు అన్నారు. ఈ పురోగతి 2025లో రాష్ట్రంలో పెరిగిన ఆర్థిక కార్యకలాపాలు, అలాగే పన్ను చెల్లింపుదారులలో కట్టుదిట్టమైన కంప్లయెన్స్, అమలు చర్యల వల్ల ఈ పురోగతి సాధ్యమైందని అధికారులు తెలిపారు.

అయితే, రాష్ట్రం 2025 నవంబర్‌లో మోస్తరు జీఎస్టీ వసూళ్లను నమోదు చేసింది. దీనికి కారణం 22-09-2025 నుండి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 రేటు తగ్గింపులు కాగా, ఆటోమొబైల్‌, సిమెంట్‌, ఎఫ్ఎమ్ సిజి, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌, పాడి ఉత్పత్తులు, ఇతర అంశాలపై రేట్లు తగ్గించారు. అలాగే జీవ, వైద్య, కాంపన్ కంపెన్సేషన్ సెస్ ని పొగాకు ఉత్పత్తులు మినహా చాలా అంశాలపై రద్దు చేశారన్నారు. 2025 నవంబర్ వసూళ్లు ప్రధానంగా 2025 అక్టోబర్ నెల వ్యాపార లావాదేవీలకు సంబంధించినవి. విభాగాల వారీగా ఆదాయం తగ్గినా (ప్రొఫెషన్ టాక్స్ మినహా) కట్టుదిట్టమైన అనుసరణ చర్యలు, రేట్ల తగ్గింపు కారణంగా పెరిగిన లావాదేవీల వాల్యూమ్ మొత్తం ఆదాయం లక్ష్యంలోని 74% చేరుకునేందుకు దోహదం చేశాయన్నారు.

జీఎస్టీ వసూళ్లు

2025 నవంబర్‌లో నికర జీఎస్టీ వసూళ్లు రూ.2,697 కోట్లు అయినా ఇది 2024 తో పోలిస్తే సంవత్సరానికిపైగా 4.60% తగ్గుదల నమోదుచేసింది. మొత్తం కమర్షియల్ టాక్స్ రెవెన్యూ (ఇతర చట్టాలు సహా) రూ.4,124 కోట్లుగా ఉంది. ఇక్కడ కూడా సంవత్సరానికి పైగా 3.17% తగ్గుదల నమోదయ్యింది. అయినా సంస్కరణల మార్పుల సమయంలో అమలు చేసిన చర్యలు రెవెన్యూ స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు.

విభాగాల వారీగా తగ్గుదల కారణాలు

ఎస్ జీఎస్టీ తగ్గుదల

ఎస్ జీఎస్టీ

ఆదాయం రూ.1,109.17 కోట్లు కాగా, 2024 నవంబర్‌లోని రూ.1,197.14 కోట్లతో పోలిస్తే 7.35% తగ్గుదల గా ఉంది. ఇది జీఎస్టి 2.0 రేటు తగ్గింపుల కారణంగా ఆటోమొబైల్, సిమెంట్, ఎఫ్ఎమ్ సిజి, ఎలక్ట్రానిక్స్, పాల ఉత్పత్తులపై తక్కువ రేట్ల ప్రభావం చూపుతుంది. వాల్యూమ్ పెరిగినప్పటికీ తక్కువ రేట్ల వల్ల మొత్తం ఆదాయం తగ్గిందన్నారు.

ఐజీఎస్టీ సెటిల్‌మెంట్ తగ్గుదల

ఐజీఎస్టీ సెటిల్‌మెంట్ రూ.1,630.10 కోట్ల నుండి రూ.1,588.15 కోట్లకు 2.57% తగ్గుదల నమోదు చేయగా దీనికి ఎస్జీఎస్టీ, ఐటిసి సర్దుబాట్లు రూ.114 కోట్లు పెరగడం (ఆటోమొబైల్ తయారీదారులపై ఐజీఎస్టీ బాధ్యతలకు సంబంధించి) రూ.74 కోట్లు ఐజీఎస్టీ రివర్సల్స్ తొలగించడం కారణమన్నారు.

మోంతా తుఫాన్ ప్రభావం తో* *పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయం తగ్గుదల

2025 లో పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయం రూ.1,320.57 కోట్ల నుండి రూ.1,306.61 కోట్లకు 1.06% తగ్గుదల నమోదయ్యింది. దీనికి ప్రధాన కారణం మోంతా తుఫాన్ ప్రభావం. ఇది వ్యాపారం, వాహనాల సంచారం, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంత రవాణాపై తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్ర ఆదాయానికి తోడ్పడిన నికర జీఎస్టి వసూళ్లు 2025 నవంబర్‌లో రూ.2,697.32 కోట్లు కాగా 2024 నవంబర్‌లోని రూ.2,827.24 కోట్లతో పోలిస్తే 4.60% తగ్గుదల నమోదు చేశాయి.

పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయం 2025 నవంబర్‌లో రూ.1,306.62 కోట్లు, 2024 నవంబర్‌లోని రూ.1,320.57 కోట్లతో పోలిస్తే 1.06% తగ్గుదల నమోదు చేసింది. దీనికి కారణం తుఫాను వల్ల సంభవించిన అంతరాయం. మద్యంపై విఏటి వసూళ్లు 2025 నవంబర్‌లో రూ.70.40 కోట్లు, 2024 నవంబర్‌లోని రూ.74 కోట్లతో పోలిస్తే 4.82% తగ్గుదల నమోదుచేసింది. ప్రొఫెషన్ టాక్స్ వసూళ్లు 2024 నవంబర్‌లోని రూ.29.41 కోట్ల నుండి 2025 నవంబర్‌లో రూ.43 కోట్లకు పెరిగి 46.22% వార్షిక వృద్ధిను సాధించాయన్నారు.

ప్రొఫెషన్ టాక్స్ లో భారీ వృద్ధి* *(రూ. కోట్లు, 30-11-2025 వరకు):

నవంబర్ 2024 నుండి 2025 వరకు జీఎస్టి రెవెన్యూ 2834.56 2703.48 −4.61%గా ఉంది. దీనిలో పెట్రోలియం ఉత్పత్తులు 1320.57 1306.62 −1.06%, మద్యం పై విఏటి 74.00 70.40 −4.82%, ప్రొఫెషన్ టాక్స్ 29.41 43.00 +46.22%గా ఉన్నాయి. మొత్తం 4258.55 4123.50 −3.16% గా నమోదయ్యింది.

అనేక విభాగాల్లో ఆదాయం తగ్గినప్పటికీ, ప్రొఫెషన్ టాక్స్ వసూళ్లు మాత్రం గణనీయమైన వృద్ధిని సాధించాయి. ప్రొఫెషన్ టాక్స్ వసూళ్లు 2024 నవంబర్‌లోని ₹29.41 కోట్ల నుండి 2025 నవంబర్‌లో ₹43 కోట్లకు పెరిగి, 46.22% వార్షిక వృద్ధిని సాధించాయి. ఈ పెరుగుదల రాష్ట్ర పన్నుల విభాగం అనుసరణ చర్యల ఫలితమే. ప్రధాన సంస్కరణలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన అంతరాయాల నడుమ కూడా రాష్ట్ర ఆదాయం నిలకడగా ఉండేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్, బాబు ఏఐఏఎస్ అన్నారు.

ఏపి జీఎస్టి వసూళ్లలో జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావం - Tholi Paluku