Let's talk: editor@tmv.in
ఏపిలో అటల్-మోదీ సుపరిపాలన యాత్ర

ఏపిలో అటల్-మోదీ సుపరిపాలన యాత్ర

Dantu Vijaya Lakshmi Prasanna
12 డిసెంబర్, 2025

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గురువారం శ్రీ సత్యసాయి జిల్లాలో 'అటల్-మోదీ సుపరిపాలన యాత్ర'ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమం డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ ర్యాలీలకు నాంది పలికింది. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణంలోని బీజేపీ కార్యాలయం నుంచి 500 మోటార్ సైకిళ్లు, 200 కార్లతో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

“వాజ్‌పేయి జన్మదిన శతాబ్దిని పురస్కరించుకుని, డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ ర్యాలీలను ప్రారంభిస్తూ మేము ఈ రోజు అటల్-మోదీ సుపరిపాలన యాత్రను ప్రారంభించాము” అని బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్డీఏ సమన్వయాన్ని బలోపేతం చేయడం, దక్షిణ రాష్ట్రవ్యాప్తంగా యువతను ప్రోత్సహించడం లక్ష్యంగా డిసెంబర్ 25 వరకు ఈ యాత్ర ప్రతి రోజు రెండు జిల్లాలను కవర్ చేస్తుందని మాధవ్ చెప్పారు.

మాధవ్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో పాటు ఇతర బీజేపీ నాయకులు బస్సు యాత్రలో ర్యాలీని నడిపించి, వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత ఈ యాత్రలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ, అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి వేడుకల సందర్భంగా ధర్మవరంలోని ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న పదో విద్యార్థులకు మా సంస్కృతి స్వచ్ఛంద సేవ సమితి ఆధ్వర్యంలో వెయ్యి(1000) ఉచిత సైకిళ్లను అందజేశాము. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాదవ్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారన్నారు.

ఏపిలో అటల్-మోదీ సుపరిపాలన యాత్ర - Tholi Paluku