Let's talk: editor@tmv.in
ఏపీసీఆర్డీఏలో 132 ఇంజినీరింగ్ పోస్టులు

ఏపీసీఆర్డీఏలో 132 ఇంజినీరింగ్ పోస్టులు

Shaik Mohammad Shaffee
16 సెప్టెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు శుభవార్త. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) ఇంజినీరింగ్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 132 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 26వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్/అసిస్టెంట్ ఇంజినీర్: 50 పోస్టులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 25 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 15 పోస్టులు, సూపరింటెండింగ్ ఇంజినీర్: 8 పోస్టులు, చీఫ్ ఇంజినీర్: 4 పోస్టులు, సీనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్పర్ట్: 2 పోస్టులు, జూనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్పర్ట్: 4 పోస్టులు, సీనియర్ ఎలక్ట్రికల్/ఈఎల్యూ ఎక్స్పర్ట్: 2 పోస్టులు, జూనియర్ ఎలక్ట్రికల్/ఈఎల్యూ ఎక్స్పర్ట్: 6 పోస్టులు, సీనియర్ ప్లంబింగ్ ఎక్స్పర్ట్: 2 పోస్టులు, జూనియర్ ప్లంబింగ్ ఎక్స్పర్ట్: 6 పోస్టులు, సీనియర్ హెచ్వీఏసీ ఎక్స్పర్ట్: 2 పోస్టులు, జూనియర్ హెచ్వీఏసీ ఎక్స్పర్ట్: 6 పోస్టులు

ఇంజినీరింగ్ పోస్టుకు అభ్యర్థులు బీటెక్, బీఈ, ఎంటెక్ లేదా డిప్లొమాతో పాటుగా సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హైరైజ్ బిల్డింగ్స్, వాటర్, వేస్ట్ వాటర్, పవర్, హెచ్వీఏసీ వంటి ప్రాజెక్ట్ల రూపకల్పన, ప్రణాళిక, అమలులో అనుభవం కలిగి ఉండాలి. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా స్వతంత్ర సంస్థలలో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఏపీసీఆర్డీఏ అధికారిక వెబ్సైట్ https://crda.ap.gov.in/ని సందర్శించండి.

ఏపీసీఆర్డీఏలో 132 ఇంజినీరింగ్ పోస్టులు - Tholi Paluku