Let's talk: editor@tmv.in
ఏఐ సిగ్నల్స్.. ఇంక ట్రాఫిక్ కష్టాలు తప్పినట్లే!

ఏఐ సిగ్నల్స్.. ఇంక ట్రాఫిక్ కష్టాలు తప్పినట్లే!

FL - SUNL
12 అక్టోబర్, 2025

అర్జెంట్ పని మీద వెళ్తుంటే.. రోడ్డు మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ వేస్తే చిరాకేస్తుంది కదా. అలా అని ట్రాఫిక్‌ని తప్పించలేము. మనం ఉన్నవైపు ఎక్కువ రద్దీ ఉంటే ఇంకోవైపు సిగ్నల్ పడితే మాత్రం కచ్చితంగా కోపం వస్తుంది. ఆటోమెటిక్ సిగ్నల్స్ వ్యవస్థ వల్ల జరుగుతున్నదిదే. ఫిక్స్‌డ్ టైం సెట్ చేసి ఉండటం వల్ల ట్రాఫిక్ రద్దీ ఉన్నా లేకపోయినా సిగ్నల్ దగ్గర పడిగాపులు కాయాల్సిందే. అందుకోసం కొత్తగా వస్తున్న ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్ రద్దీని తగ్గించలేకపోయినా, సిగ్నల్స్ వ్యవస్థనైనా క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా ఎక్కువ ట్రాఫిక్ ఉన్నవైపు ఎక్కువ సేపు, తక్కువ రద్దీ ఉంటే తక్కువ సేపు సిగ్నల్ ఇస్తుంది. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ నగరంలో సిగ్నల్స్ కి ఏఐని అనుసంధానించి ట్రాఫిక్ నియంత్రణ ప్రారంభించింది. అక్కడి ఫలితాలను బట్టి తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితంలో భాగం అయిపోయింది అనటానికి ఇండియాలోని ఈ ఘటనే ఉదాహరణ. రోడ్డెక్కితే ట్రాఫిక్.. ట్రాఫిక్.. ఇది అందరికీ కామన్. ఇలాంటి ట్రాఫిక్ విభాగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది.. ట్రాఫిక్ సిగ్నల్స్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటీ అంటారా.. అదే ఇప్పుడు మీరు పూర్తి తెలుసుకోబోయే వార్త.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఉంది కదా.. ఇది నిజం కూడా అవుతుంది..

రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ సిటీ. ఈ నగరంలోని ట్రాఫిక్స్ సిగ్నల్స్ కు ఏఐ.. ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం చేశారు. జంక్షన్ దగ్గర అధునాతనమైన కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలు సెన్సార్ లతో పని చేస్తాయి. జంక్షన్ చుట్టూ నాలుగు లైన్లు ఉంటాయి కదా.. ఈ నాలుగు లైన్లలోని ట్రాఫిక్ రద్దీని కెమెరాలు చూస్తూ ఉంటాయి. ఎటు వైపు రద్దీ ఎక్కువగా ఉంది అనే సెన్సార్ల ద్వారా గుర్తించి.. అటు వైపు ఆటోమేటిక్ గా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

ఉదాహరణ గా చెప్పాలంటే.. లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ రద్దీగా ఉంది.. రైట్ సైడ్ ట్రాఫిక్ తక్కువగా ఉంది. మామూలుగా అయితే ట్రాఫిక్ ఎలా ఉన్నా ఆల్టర్ నేట్ గా సిగ్నల్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఉన్న సిగ్నల్ వ్యవస్థ. కొత్తగా వచ్చిన AI ట్రాఫిక్ సిగ్నల్స్.. ఇలాంటి ఆటోమేటిక్ సిస్టమ్ కింద పని చేయదు. ఎటు వైపు రద్దీ ఎక్కువగా ఉందో అటు వైపు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సో.. జంక్షన్ దగ్గర ఇక నుంచి 30 సెకన్లు.. 60 సెకన్లు.. 90 సెకన్లు అనే టైం డ్యూరేషన్ ఉండదు.. రద్దీ ఎటువైపు ఎక్కువగా ఉంటే అటు వైపు ముందుగా క్లియర్ చేస్తుంది. ఆ తర్వాతనే మిగతా లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

మరి ఎమర్జన్సీ సర్వీసుల సంగతి ఏంటీ అని డౌట్ రావొచ్చు.. అదేనండీ అంబులెన్స్ లు, అగ్నిమాపక వాహనాలు, పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ ఇలాంటివి ఏంటీ అంటారా.. ఆయా వాహనాలు ఇచ్చే సైరన్స్.. ఆయా వాహనాలపై ఉండే లైట్లు ఆధారంగా.. ఆటోమేటిక్ గా ఆ లైన్.. ఆ రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సో.. నో ప్రాబ్లమ్ అన్నమాట. అంతేకాకుండా అత్యవసరాలు, ప్రొటోకాల్ వెహికల్స్, గ్రీన్ చానల్ ఇవ్వాల్సిన సందర్భాల్లో మాన్యువల్ మోడ్‌ను కూడా వాడవచ్చు.

రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ సిటీలో.. 2025, అక్టోబర్ 11వ తేదీన ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారు. ఒక్కో జంక్షన్ లో ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయటానికి 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని.. ఉదయ్ పూర్ సిటీ ట్రాఫిక్ డీఎస్పీ అశోక్ అంజనా వెల్లడించారు. మరి ఉదయ్ పూర్ వరకు వచ్చిన AI ట్రాఫిక్ సిగ్నల్స్.. మన హైదరాబాద్ సిటీకి రావటం ఎంతోసేపు పట్టదు కదా.. ఇలా దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇలాంటి ఏఐ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రోడ్లపై రద్దీని మెరుగ్గా, సమర్థవంతంగా నిర్వహించటం అధికారులకు కూడా సులభతరం అవుతుంది.