
ఎల్టీటీఈ ప్రభాకరన్ పై టీవీకే చీఫ్ ప్రశంసలు
Pinjari Chand
21 సెప్టెంబర్, 2025
టీవీకే అధినేత, తమిళ నటుడు విజయ్ బస్సు యాత్రలో భాగంగా శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఎల్ టీటీఈ ప్రభాకరన్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభారకన్ శ్రీలంక తమిళ సమాజానికి తల్లిలాంటి వారని, శ్రీలంక తమిళులు తమిళనాడు వారికి సోదరులు అని, తమిళులు ప్రపంచంలో ఎక్కడున్నా అన్నదమ్ముల్లాంటి వారేనని అన్నారు. మనపై ప్రేమను చూపించిన ప్రభాకరన్ ను కోల్పోవడం బాధాకరమన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడైన ప్రభాకరన్ ను ప్రశంసించడం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తమిళుల సమస్య నాగపట్నంలో తీవ్రమైన భావోద్వేగాలతో కూడుకొని ఉంటుంది.
