
ఎలక్షన్ కమిషన్‌కు జూబ్లీహిల్స్‌లో డబ్బుల పంపిణీపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ డబ్బులు పంపిణీ చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డిని సోమవారం బీఆర్‌కే భవన్‌లో కలిసి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు నగదు పంపిణీ చేయడం,నియమావళి ఉల్లంఘనలకు పాల్పడడం జరుగుతోందని వారు ఆరోపించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఈవోకు విజ్ఞప్తి చేశారు.బీఆర్‌ఎస్ నాయకులు సీఈవో సుదర్శన్ రెడ్డికి సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు పత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలన్నారు. “ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరమని తెలిపారు.
జూబ్లీహిల్స్ నకిలీ ఓటరు ఐడీలపై హరీష్ రావు ఫైర్
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్టాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇష్టరాజ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోందని వాటికి సంబంధించిన అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్‌కి సమర్పించామని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ని కోరాం అని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకుండా, కొంతమంది పోలీస్ అధికారులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని, అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఎన్నికల సంఘానికి సమర్పించిన వీడియో
కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న భయంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓటరు ఐడీ కార్డులను సృష్టించి, పంపిణీ చేస్తోందని ఆరోపిస్తూ హరీష్ రావు కీలకమైన వీడియో సాక్ష్యాన్ని ఎన్నికల అధికారులకు సమర్పించారు.ఈ నకిలీ ఓటరు కార్డులను ఉపయోగించి దొంగ ఓట్లను వేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, తద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని చూస్తోందని హరీష్ రావు పేర్కొన్నారు.ఈ 'షాకింగ్ వీడియో'పై తక్షణమే విచారణ జరిపి, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ బృందం ప్రధాన ఎన్నికల అధికారిని కోరాం అని పేర్కొన్నారు.
