Let's talk: editor@tmv.in
ఎలక్ట్రిక్​ స్కూటీలో మంటలు- దంపతుల సజీవ దహనం

ఎలక్ట్రిక్​ స్కూటీలో మంటలు- దంపతుల సజీవ దహనం

Pinjari Chand
17 సెప్టెంబర్, 2025

నిత్యం ఎలక్ట్రిక్ వాహానాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఓ చోట వాహనదారులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటీ షార్ట్ సర్య్కూట్ తో పేలి ఇద్దరు సజీవ దహనమయ్యారు. జగదీశ్పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెల్లవారు జామున ఆగ్రాలోని లక్ష్మీ నగర్ కు చెందిన ప్రమోద్ ఇంటికి దగ్గరలో వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం రాత్రి రోజూ మాదిరి తన స్కూటీకి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టి తన గదిలో పడుకున్నాడు. అతడి తండ్రి భగవతి ప్రసాద్(90), తల్లి ఉర్మిళదేవి(85)తో పాటు ప్రమోద్ కూతురు కకుల్ మరో గదిలో నిద్రపోయారు.

అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా షార్ట్ సర్య్కూట్ తో స్కూటీలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఇంటి మొత్తానికి వ్యాపించాయి. ప్రమోద్ కూతురు కేకలు వేయడంతో ప్రమోద్ వచ్చేవరకు మంటల్లో చిక్కుకుని తండ్రి భగవతి ప్రసాద్ చనిపోయారు. తల్లిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు ఒకేసారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలతో జాగ్రత్తగా ఉండాలని, చార్జింగ్ ఓవర్ లోడ్ అయి షార్ట్ సర్య్కూట్ అయిందా అన్న కోణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఎలక్ట్రిక్​ స్కూటీలో మంటలు- దంపతుల సజీవ దహనం - Tholi Paluku