Let's talk: editor@tmv.in
ఎర్రకోట పేలుళ్ల కేసులో ఆమీర్‌ రషీద్‌ అలీకి కస్టడీ

ఎర్రకోట పేలుళ్ల కేసులో ఆమీర్‌ రషీద్‌ అలీకి కస్టడీ

Pinjari Chand
18 నవంబర్, 2025

ఆమీర్‌ను భారీ భద్రత మధ్య కోర్టుకు తీసుకువచ్చి ప్రత్యేక ఎన్ఐఏ జడ్జి అంజు బజాజ్‌ చందనాఢిల్లీని కుదిపేసిన నవంబర్‌ 10 కార్‌ బ్లాస్ట్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమీర్‌ రషీద్‌ అలీని విచారణ కోసం 10 రోజులు కస్టడీలోకి ఇవ్వాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోరగా, పాటియాలా ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సోమవారం అనుమతి మంజూరు చేసింది. ముందు హాజరుపరచగా, కోర్టు కస్టడీ ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌–కెమెరాలో విచారణ జరిగింది. ఆదివారం అతడిని ఎన్ఐఏ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఎన్ఐఏ విడుదల చేసిన వివరాల ప్రకారం పుల్వామా జిల్లా సమ్ బూరా, పాంపోర్‌కు చెందిన ఆమీర్‌ రషీద్‌ అలీ సూసైడ్‌ బాంబర్‌ ఉమర్‌ ఉన్‌ నబీతో కలిసి ఢిల్లీ కార్‌ బ్లాస్ట్‌ను జరిపేందుకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో బయటపడింది. బ్లాస్ట్‌కు ఉపయోగించిన కార్‌ ఆమీర్‌ పేరుతోనే రిజిస్టర్‌ అయి ఉండటం కూడా విచారణలో కీలక అంశంగా మారింది. కారు‌ కొనుగోలు కోసం ఆమీర్‌ ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చినట్లు ఏజెన్సీ తెలిపింది. ఫొరెన్సిక్‌ పరీక్షల ద్వారా వాహనాన్ని నడిపిన వ్యక్తి మరణించిన ఉమర్‌ ఉన్‌ నబీయేనని ఎన్ఐఏ నిర్ధారించింది. ఉమర్‌ ఉన్‌ నబీ ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీలో జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి చెందిన మరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 73 మంది సాక్షులను, అందులో గాయపడిన వారినీ, విచారించినట్లు వెల్లడించింది. ఢిల్లీ పోలీసులు, జమ్మూ కశ్మీర్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ పోలీసులతో కలిసి పని చేస్తూ, దాడి వెనుక ఉన్న విస్తృత కుట్రను వెలికితీయడానికి అనేక కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తోంది.

ఈ దారుణ ఘటన నేపథ్యంలో సోమవారం ఫరీదాబాద్‌లో ప్రారంభమైన 32వ ఉత్తర మండల సమితి సమావేశంలో ఎర్రకోట పేలుళ్ల సమయంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులు బ్లాస్ట్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా రెండు నిమిషాల మౌనం పాటించారు.