Let's talk: editor@tmv.in
ఎయిమ్స్ మంగళగిరిలో 121 ఫ్యాకల్టీ పోస్టులు

ఎయిమ్స్ మంగళగిరిలో 121 ఫ్యాకల్టీ పోస్టులు

Shaik Mohammad Shaffee
12 అక్టోబర్, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో ఉన్న ప్రతిష్టాత్మక ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (ఎయిమ్స్) రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అదనపు ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. ప్రతి పోస్టుకు ఎంసీఐ/ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం నిర్దిష్ట సంఖ్యలో బోధన లేదా పరిశోధన అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 58 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడౠ్ల్యడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/ఈడౠ్ల్యఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ.3,100, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు రూ.2,100గా ఉంది.

జీత భత్యాలు

ఈ పోస్టులు గ్రూప్ 'ఏ' పరిధిలోకి వస్తాయి కాబట్టి ఎయిమ్స్ మంగళగిరి ఏడవ కేంద్ర వేతన కమిషన్ సిఫార్సుల మేరకు నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,68,900, అడిషనల్ ప్రొఫెసర్‌కు రూ.1,48,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,38,300, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,01,500 వరకు లభిస్తుంది. జీతంతో పాటు వీరికి అదనపు ప్రయోజనాలు హెచ్ఆర్ఏ, డీఏ, ఎన్‌పీఏ వంటివి వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ

దరఖాస్తు చేసిన అభ్యర్థులను వారి విద్యార్హతలు, అనుభవం, ప్రచురించిన పరిశోధనా పత్రాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల బోధనా సామర్థ్యం, వైద్య పరిజ్ఞానం, పరిశోధనా ఆసక్తిని అంచనా వేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది జాబితాను సిద్ధం చేస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎయిమ్స్ మంగళగిరి అధికారిక వెబ్‌సైట్ aiimsmangalagiri.edu.inను సందర్శించండి.

ఎయిమ్స్ మంగళగిరి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఒక ప్రతిష్టాత్మక వైద్య, పరిశోధనా సంస్థ. దీనిని ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద స్థాపించారు. 2018 నుండి ఇక్కడ ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యాయి. అత్యాధునిక వైద్య సదుపాయాలను అందించడం, నాణ్యమైన వైద్య విద్యను బోధించడం, పరిశోధనలను ప్రోత్సహించడం ఎయిమ్స్ ప్రధాన లక్ష్యాలు. ఎయిమ్స్ మంగళగిరి మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలను కూడా అందిస్తోంది. ఇది రాష్ట్రంలో వైద్య రంగంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడంలో కీలకపాత్ర పోషిస్తోంది.

ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థానం అనేది ఫ్యాకల్టీ కెరీర్‌లో ప్రారంభ స్థానం. ఈ స్థాయిలో వారు రోగి సంరక్షణ సేవల్లో చురుగ్గా పాల్గొంటారు. జూనియర్ రెసిడెంట్లు, ఎంబీబీఎస్ విద్యార్థులకు క్లినికల్/ప్రీ-క్లినికల్ బోధన అందిస్తారు. అనుభవం ఆధారంగా ప్రమోషన్ ద్వారా అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా ఎదగడానికి అవకాశం ఉంటుంది.