Let's talk: editor@tmv.in
ఎయిర్ పోర్టులో రూ.12 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

ఎయిర్ పోర్టులో రూ.12 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Gaddamidi Naveen
21 సెప్టెంబర్, 2025

శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దాని విలువ రూ.12 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన భారతీయ మహిళ దీనిని రవాణా చేస్తూ పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోన్ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె బ్యాగులో 12 కేజీల హైడ్రోపోనిక్‌ గంజాయి బయటపడింది. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ.కోటి వరకు పలుకుతోంది. దీంతో ఆ ప్రయాణికురాలిని ఎన్‌డీపీఎస్ చట్టం 1985 కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

ఎయిర్ పోర్టులో రూ.12 కోట్ల విలువైన గంజాయి పట్టివేత - Tholi Paluku