Let's talk: editor@tmv.in
ఎయిమ్స్ డియోఘర్లో 174 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎయిమ్స్ డియోఘర్లో 174 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

Shaik Mohammad Shaffee
17 సెప్టెంబర్, 2025

తొలిపలుకు, విద్య, ఉద్యోగం:* దేశంలోని ప్రతిష్టాత్మక వైద్య సంస్థల్లో ఒకటైన డియోఘర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 174 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జనరల్-55, ఓబీసీ-49, ఎస్సీ-34, ఎస్టీ-17, ఈడబ్యూఎస్-19 కేటగిరీల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 20, 2025.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/ఎండీఎస్ డిగ్రీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఓసీ అభ్యర్థులు రూ.3,000, ఓబీసీ/ఈడబ్ల్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.67,700తో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. ఈ నియామకాలకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ను అవసరమైన పత్రాలతో కలిపి స్పీడ్ పోస్ట్ ద్వారా చిరునామా: రిజిస్ట్రార్ ఆఫీస్, 4వ అంతస్తు, ఎయిమ్స్, దేవీపుర్ (అకడమిక్ బ్లాక్), డియోఘర్-814152, ఝార్ఖండ్కు పంపించాలి.

అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీని అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు. ఈ పోస్టులు మొదట ఒక సంవత్సరం కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన ఉంటాయి. ఆ తర్వాత పనితీరు ఆధారంగా గరిష్టంగా మూడేళ్ల వరకు పొడిగిస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు aiimsdeoghar.edu.in వెబ్సైట్ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకొని, దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకోండి.

ఎయిమ్స్ డియోఘర్లో 174 సీనియర్ రెసిడెంట్ పోస్టులు - Tholi Paluku