
ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు... 30న విచారణ
Gaddamidi Naveen
29 జనవరి, 2026
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిని సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్‌కు అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఈ విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ విచారణలో దానం నాగేందర్ ఇచ్చే వివరణ ఆధారంగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
