
ఎమ్మెల్యేకు ఖాళీ కుర్చీతో నిరసన
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేపట్టిన "ఖాళీ కుర్చీ నిరసన" తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విశేష చర్చకు దారి తీసింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇటివల కాలంలో పీరాయింపుల పార్టీ మార్పు గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ తాన బీఆర్ఎస్ పార్టీకే చెందానని పలు వేదికలపై ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రవర్తన మాత్రం కార్యకర్తల్లో ఆసంతృప్తిని కలిగించింది. ఈ ఆసంతృప్తిని వ్యక్తసరచడానికి నాయకులు ఒక కొత్త పద్దతిని అనుసరించారు. తాజాగా నిర్వహించిన మండల సమావేశానికి ఆయన రాకపోవడంతో ఈ అనుమానాలను మరింత బలపరిచింది.
ఖాళీ కుర్చీ నిరసన ప్రత్యేకత
పార్టీ నాయకులు ఎమ్మెల్యే కోసం ప్రత్యేక కుర్చీని సిద్ధం చేశారు. కానీ ఎమ్మెల్యే యాదయ్య రాకపోవడంతో ఆ కుర్చీని ఖాళీగానే ఉంచి, "నిజంగానే మీరు పార్టీలో ఉంటే సమావేశానికి హాజరుకావాలి, మీ కుర్చీ ఖాళీగా ఉంది" అనే సందేశాన్ని బహిర్గతం చేశారు. ఈ వినూత్న నిరసన ఒక సింబాలిక్ పద్ధతిగా నిలిచి, కార్యకర్తల అసహనాన్ని స్పష్టంగా తెలియజేసింది. సాధారణంగా రాజకీయ నిరసనలు ర్యాలీలు, నినాదాల రూపంలో జరుగుతుంటే, ఈసారి బీఆర్ఎస్ నాయకులు ప్రాతినిధ్యం కోసం కుర్చీని ఉపయోగించామని తెలిపారు.
బీఆర్ఎస్ లో అంతర్గత అసంతృప్తి
ఈ కార్యక్రమానికి హాజర్తెన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 2024 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి కఠినంగా మారిందని. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలోకి రాగా, మరోవైపు పార్టీ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు. అనేకమంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పార్టీ మార్పు గురించి ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో యాదయ్య కూడా తరచూగా పార్టీ, సమావేశ సమీక్షలలో లేకపోవడం ఆయన భవిష్యత్తుపై ఊహాగానాలు పెంచుతోందన్నారు. పార్టీ పీరాయింపు పది మంది ఎమ్మెల్యేలు మాజీలు అవడం ఖయ్యమని తెలిపారు.
కార్యకర్తల అభిప్రాయం
స్థానిక కార్యకర్తలు ఏమంటున్నారంటే, "పార్టీకి కష్టకాలం ఇది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు బలంగా నిలబడి కార్యకర్తలకు తోడుగా ఉండాలి. కానీ నాయకులు దూరంగా ఉంటే మమ్మల్ని నిరుత్సాహ పరుస్తారని పేర్కొన్నారు. పార్టీ పట్ల ప్రజల విశ్వాసం పోకుండా ఉండటం కోసం ఎమ్మెల్యేల సహకారం తప్పనిసారి అని స్పష్టం చేశారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లోనూ గట్టిగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష పార్టిగా మారిన వేళ, ఇలాంటి అంతర్గత విభేదాలు, అసంతృప్తులు పార్టీ స్థిరత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఖాళీ కుర్చీ నిరసన ఒక చిన్న సంఘటనగా కనిపించినప్పటికీ, ఇది బీఆర్ఎస్‌లోని అస్థిరతను, కార్యకర్తల అసహనాన్ని ప్రతిబింబిస్తోంది.
భవిష్యత్తు రాజకీయ సంకేతాలు
కార్యక్రమానికి హాజరు కాని ఎమ్మెల్యే యాదయ్య నిజంగానే బీఆర్ఎస్‌లో కొనసాగుతారా లేదా కొత్త రాజకీయ నిర్ణయం తీసుకుంటారా అన్నది స్పష్టత కావాల్సిన అంశంగా మారింది. ఆయన నిర్ణయం స్థానిక రాజకీయాలపైనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కాంగ్రెస్ బీజేపీ వంటి పార్టీలు బలాన్ని పెంచుకోవాలని చూస్తున్న సందర్భంలో, బీఆర్ఎస్‌లో ఉద్రిక్తతలు ఇతర పార్టీలకు లాభం చేకూరించే అవకాశం ఉంది. మొత్తానికి, నవాబుపేటలో జరిగిన ఈ వినూత్న నిరసన బీఆర్ఎస్ అంతర్గత పరిస్థితులను బహిర్గతం చేసింది. కుర్చీ ఖాళీగా ఉండటం కేవలం ఒక వ్యక్తి రాకపోవడం మాత్రమే కాకుండా, పార్టీ ఎదుర్కొంటున్న అస్థిరతను కూడా ప్రతిబింబించిందనే చెప్పాలి.
