Let's talk: editor@tmv.in
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నాడు: హరీశ్‌రావు

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నాడు: హరీశ్‌రావు

Gaddamidi Naveen
2 డిసెంబర్, 2025

సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే, హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆయ‌న‌ ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతుంటే ఈసీ ఏం చేస్తోందని నిలదీశారు.కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ కు సీఎం శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు, రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడవా? ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసే ఆ పనికి ఎన్నికల కోడ్ కు ఎందుకు వర్తించదు? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వెంటనే సమీక్షించి పోలీసుల ద్వారా సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

అలాగే మాజీమంత్రి విద్యుత్‌ శాఖపై మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం 2026 నాటికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని 40 శాతం తగ్గించే ధ్యేయంతో శ్వేతపత్రాన్ని శాసనసభలో సమర్పించిందని. పునరుత్పాదక శక్తిపై ప్రాధాన్యం ఇచ్చి, థర్మల్‌పై ఆధారాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు.కానీ తాజాగా ఆయన 2,400 మెగావాట్ల కొత్త థర్మల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం అని మీరే అంటున్నార‌ని ఆయ‌న తెలిపారు. NTPC నుంచి తక్కువ ధరకు విద్యుత్ తీసుకోకుండా, కమిషన్ల కోసం రామగుండంలో సొంత థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఒక యూనిట్ విద్యుత్‌పై అదనంగా రూ.3 ఖర్చు పెడితే రోజుకు 3 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం అవుతుందన్నారు. అంటే తెలంగాణ ప్రజలపై రోజుకు రూ.9 కోట్లు అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు.

వీటి ఆధారంగా, సంవత్సరానికి రూ.3,285 కోట్ల వరకు అదనపు ఖర్చు రావచ్చని ఆయ‌న‌ హెచ్చరించారు. రామగుండం ప్లాంట్ 25 సంవత్సరాల అగ్రిమెంట్ కింద నడిచితే, మొత్తం తెలంగాణ ప్రజలపై రూ.82,000 కోట్ల భారం పడనుందన్నారు.ఇవాళ విద్యుత్ శాఖను ఆంధ్ర అధికారులతో నింపేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ వాళ్ళు ఉండాలని ఉద్యమం జరిగింది. కేసీఆర్ 95 శాతం లోకల్ రిజర్వేషన్లను ఉద్యోగాల్లో సాధించారని ఆయ‌న అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ విభాగంలో అత్యంత కీలకమైన పోస్టుల్లో ఆంధ్ర అధికారులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతున్న అనుమానం కలుగుతుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులను అత్యంత కీలకమైన విభాగాల్లో వరుసగా నియమించారు అని ఆయ‌న విమ‌ర్శించారు.

భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు మాజీ మంత్రి కౌంటర్

భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హ‌రీష్ రావు కౌంటర్‌ చేశారు. ఆయన ట్వీట్‌లో “నేను అన్‌ఫిట్ ఫర్ పాలిటిక్స్ కాదు, నువ్వే అన్‌ఫిట్ ఫర్ పాలిటిక్స్” అని గట్టి వ్యాఖ్య చేశారు. సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం చరిత్రలో ఏ దఫా జరిగినదో ఆయన ప్రశ్నించారు. “మరి అన్‌ఫిట్ ఎవరు, నేనా లేదా నువ్వా? అని లైమ్‌లైట్‌లో ప్రశ్న విసరగా చెప్పారు. అదేవిధంగా, బిల్లులు చెల్లించడానికి 20 నుంచి 30 శాతం కమిషన్ తీసుకోవడం వంటి అంశాలను భట్టి విక్రమార్కపై ఎత్తిచూపుతూ, అందులో నేను అన్‌ఫిట్ కావొచ్చు అని ఆయ‌న తెలిపారు.