
ఎచ్‌ఐఎల్ సీజన్‌కు పైపర్స్ కెప్టెన్లుగా జర్మన్‌ప్రీత్, నవనీత్
రాబోయే హాకీ ఇండియా లీగ్ (ఎచ్‌ఐఎల్) సీజన్ కోసం ఎస్‌జీ పైపర్స్ ఫ్రాంచైజీ తమ పురుషుల, మహిళల జట్ల నాయకత్వాన్ని ప్రకటించింది. రక్షణ క్రీడాకారుడు జర్మన్‌ప్రీత్ సింగ్‌కు పురుషుల జట్టు పగ్గాలు అప్పగించగా, మహిళల జట్టుకు స్టార్ ఫార్వర్డ్ నవనీత్ కౌర్‌ను మరోసారి కెప్టెన్‌గా కొనసాగించారు.
పురుషుల జట్టులో ఆస్ట్రేలియా క్రీడాకారుడు కై విలాట్‌ను వైస్ కెప్టెన్ నియమించారు. గత సీజన్‌లో విలాట్ తన స్థిరమైన ప్రదర్శన, ఆటను సమతుల్యం చేసే నైపుణ్యం, బృందానికి వేగం అందించే తీరు వల్ల ప్రత్యేకంగా మెప్పించాడు. తాజాగా హాకీ క్లబ్ మెల్బోర్న్ తరఫున హాకీ వన్ ముగింపు పోటీలో కీలక పాత్ర పోషించి జట్టును విజయం వైపు నడిపిన అనుభవం అతని నాయకత్వాన్ని మరింత బలపరుస్తోంది.
జర్మన్‌ప్రీత్ గత సీజన్‌లో పైపర్స్ తరఫున అత్యుత్తమ ఆట ఆడారు. అంతేకాకుండా ఆసియా కప్ 2025లో భారత జట్టు విజయంలో అతని ప్రాధాన్యం కొత్త బాధ్యతలను చేపట్టడానికి పురిగొల్పింది.
మహిళల జట్టులో నవనీత్ కౌర్ మరోసారి కెప్టెన్‌గా తిరిగి వస్తున్నారు. గత సీజన్‌లో ఆమె దూకుడు, కీలక సమయంలో గోల్స్ చేయడం, అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రభావం చూపడం వంటి అంశాలు ఆమెను సహజ నాయకురాలిగా నిలబెట్టాయి.
ఆమెకు వైస్ కెప్టెన్ బాధ్యతలను ఆస్ట్రేలియా క్రీడాకారిణి కైట్లిన్ నాబ్స్ చేపట్టనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న నాబ్స్ రక్షణలో స్థిరత్వం, తీర్పు, టీమ్ కు సమతుల్యం తీసుకురావడం వంటి లక్షణాలతో జట్టుకు పరిపుష్టి కలిగిస్తారని అంచనా. 2025 ఎచ్‌ఐఎల్ విజేతగా నిలిచిన ఆమె గత వారం ముగిసిన హాకీ వన్ ఫైనల్‌లో పర్థ్ థండర్‌స్టిక్స్ తరఫున కీలకపాత్ర పోషించారు.
