Let's talk: editor@tmv.in
ఎంపీ మహువా కేసును అధ్యయనం చేయాలి:లోక్ పాల్ అనుమతిపై హైకోర్టు

ఎంపీ మహువా కేసును అధ్యయనం చేయాలి:లోక్ పాల్ అనుమతిపై హైకోర్టు

Pinjari Chand
19 నవంబర్, 2025

టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై ‘క్యాష్ ఫర్ క్వెరీస్’(పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి లేదా వేయడానికి ఒక ప్రజాప్రతినిధి (ఎంపీ) డబ్బు తీసుకున్నారని చేసే ఆరోపణ) కేసులో సీబీఐ చార్జ్‌షీట్‌కు లోక్ పాల్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పరిశీలనకు తీసుకుంటామని తెలిపింది. సీల్ కవర్‌లో అందిన లోక్ పాల్ ఆర్డర్‌ను పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున విచారణను ఈ నెల నవంబర్ 21కు వాయిదా వేస్తున్నట్లు బెంచ్ తెలిపింది. మోయిత్రా న్యాయవాది లోక్ పాల్

మేం ఇచ్చిన వివరాలను పరిగణలోకి తీసుకోకుండా అనుమతి ఇచ్చిందని వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సెక్షన్ 20 ప్రకారం పబ్లిక్ సర్వెంట్ తెలిపే వ్యాఖ్యలను తప్పనిసరిగా పరిశీలించాలి. కానీ వాదనల్ని పూర్తిగా విస్మరించారు అని తెలిపారు. దీనిపై కోర్టు మీ ప్రధాన అభ్యంతరం అదేనా? అని ప్రశ్నించగా, న్యాయవాది అవును ఇంకా మరికొన్ని లోపాలూ ఉన్నాయని అన్నారు.

లోక్ పాల్ ఆర్డర్‌లో ఉన్న వ్యాఖ్యల ఆధారంగా మాత్రమే వాదనలు వినడం సరికాదని, మొత్తం ఆర్డర్‌ను చూసిన తరువాతనే అభిప్రాయం వెల్లడిస్తామని బెంచ్ స్పష్టం చేసింది. దీని ప్రకారం మోయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌లో లోక్ పాల్ సీబీఐ నివేదికను స్వతంత్రంగా పరిశీలించకుండానే అనుమతి ఇచ్చిందని, తాము ఇచ్చిన నివేదికను పూర్తి వివరాలు లేవు అంటూ పక్కన పెట్టడం సహజ న్యాయానికి విరుద్ధమని ఆరోపించారు. సెక్షన్ 20(7) ప్రకారం చార్జ్‌షీట్‌ అవసరమా? క్లోజర్ రిపోర్ట్‌ సరైనదా? శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా? అనే అంశాలపై లోక్ పాల్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలని, కానీ అది జరగలేదని పిటిషన్‌లో తెలిపారు.

కేసు పుర్వాపరాలు

అక్టోబర్ 2023లో న్యాయవాది జై ఆనంద్ దేవద్రాయి చేసిన ఆరోపణలతో ఈ వివాదం ప్రారంభమైంది. ఫిర్యాదు లోక్ పాల్ కు వెళ్లిన తరువాత సీబీఐ ప్రాథమిక నివేదికను ఫిబ్రవరి 2024లో సమర్పించింది. ఆపై లోక్ పాల్ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దీంతో జూన్ 30న సీబీఐ పూర్తి నివేదిక ఇచ్చింది. జూలైలో మోయిత్రా నుంచి వివరణ కోరారు. అక్టోబరులో ఇరు పక్షాల వాదనలు విని, లోక్ పాల్ నవంబర్ 12న అనుమతి ఇచ్చింది.లోక్ పాల్ అనుమతి ఇవ్వడం చట్టబద్ధమేనా? లేక మోయిత్రా వాదనలు పట్టించుకోకపోవడం సహజ న్యాయానికి విరుద్ధమా? అన్న అంశాలను హైకోర్టు నవంబర్ 21న మరలా విచారించనుంది.

ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన ఆరోపణలు

• మహువా మోయిత్రా పై క్యాష్-ఫర్-క్వెరీస్ ఆరోపణల ప్రకారం, ఆమె అడిగిన ప్రశ్నలలో చాలా భాగం డార్షన్ హిరానందనీ, అతని వ్యాపార ప్రయోజనాలకు అనుకూలంగా ఉండేలా అడిగారని ఆరోపణలు.

• ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను హిరానందనీ సహచరులకు, అతని వర్గానికి కమీషనర్లుగా ఉన్న వ్యక్తులకు షేర్ చేసిన విషయాన్ని ఒప్పుకున్నారు.

• మోయిత్రా చెప్పినట్లు, హిరానందనీ వర్గంలో ఒక వ్యక్తి ఆమె తరఫున ప్రశ్నలను టైప్ చేసి, ఆమె ఆ లాగిన్ ద్వారా ఓటీపీ ఇచ్చి ఆ ప్రశ్నలను ఆ బృందం ఇచ్చేది.

• కొన్ని మీడియా కథనాల ప్రకారం ఆమె అడిగిన ప్రశ్నలు అదానీ గ్రూప్‌పై, దాని వ్యాపార వర్గాల లాభాలకు సంబంధించిన అంశాలపై ఉన్నాయి.