
ఊర్వశి, మిమిచక్రవర్తిలకు ఈడీ నోటీసులు
Pinjari Chand
15 సెప్టెంబర్, 2025
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ చేసినందుకు మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి, సినీనటి ఊర్వశి రౌతేలాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే యాప్ విషయాల్లో ఈడీ దూకుడు మీదుంది. ప్రమోషన్ చేసిన నటీ,నటులను విచారించింది. తాజాగా మిమి చక్రవర్తిని ఈ నెల 15న , ఊర్వశిని 16న ఢిల్లీలోని కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని
ఆదేశించింది. వీరు ప్రముఖ బెట్టింగ్ యాప్ 1ఎక్స్ బెట్టింగ్ కు ప్రచారం చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఆర్థిక లావాదేవీలు, ప్రచారాల్లో వీరి పాత్ర ఎంతో రాబట్టడానికే విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఇదే కేసులో శిఖర్ ధవన్, హర్భజన్ సింగ్, రైనా, యువరాజ్ సింగ్ లను ఈడీ విచారించింది. టాలీవుడ్ లోనూ రానా, ప్రకాశ్ రాజ్, మంచులక్ష్మీ, విజయ్ దేవరకొండలను కూడా ఇదే యాప్ ప్రమోషన్ లో విచారించారు.
