Let's talk: editor@tmv.in
ఉస్మానియా యూనివర్సిటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఈఈ

ఉస్మానియా యూనివర్సిటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఈఈ

Gaddamidi Naveen
17 డిసెంబర్, 2025

ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రూ. 6,000 లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతి నిరోధక శాఖకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ డివిజన్‌లో పనిచేస్తున్న ఈ అధికారి, మొత్తం రూ. 11,000 లంచం డిమాండ్‌ చేయగా, అందులో భాగంగా ఫిర్యాదుదారుడి నుంచి రూ. 6,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని మానేరు బాయ్స్ హాస్టల్‌లో ఫిర్యాదుదారుడు పూర్తి చేసిన రూ. 7.37 లక్షల విలువైన రెనోవేషన్ పనుల బిల్లులను విడుదల చేయడం కోసం.అలాగే, భవిష్యత్తులో ఓయూ క్యాంపస్‌లో చేసే కాంట్రాక్ట్ పనులకు ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోవడం కోసం అని ఏసీబీ తెలిపింది.

నిందితుడైన అధికారి అంతకుముందు కూడా డిజిటల్ పేమెంట్స్ ద్వారా రూ 5000ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. తర్వాతి రూ.6,000 లంచం డబ్బును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. అతడు "అక్రమ లబ్ది పొందడానికి అన్యాయంగా, నిజాయితీ లేకుండా" తన విధిని నిర్వర్తించాడని ఏసీబీ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో ఉంది.ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వ విభాగాలలో లావాదేవీలలో నిబద్ధత, పారదర్శకతల పట్ల చిత్తశుద్ధి అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.

ఉస్మానియా యూనివర్సిటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఈఈ - Tholi Paluku