
ఉస్మానియాలో బతుకమ్మ ఉత్సవాల్లో మంత్రి సురేఖ
Gaddamidi Naveen
25 సెప్టెంబర్, 2025
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఓయూలో బతుకమ్మ వేడుకలు సంప్రదాయంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకులు, విద్యార్థులు కలిసి వివిధ రంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, ఆట, పాటలతో బతకమ్మ వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన ప్రాంతీయ సాంస్కృతిక సంప్రదాయాలను మరవద్దని, యువత తెలంగాణకు అండగా నిలవాలని, ప్రజల్లో ఐక్యత పెరిగేలా కృషి చేయాలని కోరారు.
