Let's talk: editor@tmv.in
ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు.. క్లారిటీ ఇచ్చిన పంచాయతీ రాజ్ శాఖ

ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు.. క్లారిటీ ఇచ్చిన పంచాయతీ రాజ్ శాఖ

Gaddamidi Naveen
24 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల నిర్వహణలో కీలకమైన ఉప సర్పంచ్‌ల అధికారాలను ప్రభుత్వం తగ్గిస్తోందని, వారికున్న ‘చెక్ పవర్’ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అయ్యింది అని వార్తలు ప్రచారం అవుతున్నప్పటికీ, ఇవన్నీ పూర్తి అవాస్తవం అని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టం చేశారు.

స్థానిక ప్రభుత్వ వ్యవస్థలో ఉప సర్పంచ్ చెక్ పవర్ కొనసాగుతుందని, కొత్త మార్పులు కొన్ని నియమావళి సమర్థతను పెంచే దిశలో మాత్రమే చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాగానం మాత్రమేనని తేల్చి చెప్పారు.ఉప సర్పంచ్‌ల ఆర్థిక అధికారాలను తొలగించే ఆలోచన ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకముందే ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రభుత్వం సూచించింది. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచ్‌లకు ఉన్న అధికారాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది.

గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తుల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లకు సంబంధించిన రివైస్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, గ్రాంట్ల విడుదల, వినియోగం పూర్తిగా డిజిటల్ విధానంలో జరగాలని స్పష్టం చేసింది.