
ఉద్యోగుల కోసం కొత్త 'డిజీప్రొటెక్ట్' ప్లాన్
భారతదేశంలోని ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన పిఎన్బి మెట్‌లైఫ్, జీతం పొందే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా పిఎన్బి మెట్‌లైఫ్ డిజీప్రొటెక్ట్ టర్మ్ ప్లాన్' ను ప్రారంభించింది. పాలసీబజార్‌తో కలిసి డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ ప్లాన్‌ను అందిస్తున్నారు.
ఇది లింక్ చేయబడని, నాన్-పార్టిసిపేటింగ్, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ డిజిటల్ విధానం వల్ల టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ఉద్యోగులకు కూడా బీమా సౌకర్యం సులభంగా అందుబాటులోకి వస్తుంది. ఈ ప్లాన్ తీసుకునే వారికి మొదటి ఏడాది ప్రీమియంపై 21% వరకు తగ్గింపు లభిస్తుంది.
'పిఎన్బి మెట్‌లైఫ్ డిజీప్రొటెక్ట్' ప్లాన్ ముఖ్య లక్షణాలు:
సమగ్ర లైఫ్ కవర్:
జీవితాంతం రక్షణ కల్పిస్తుంది. ప్రాణాంతక వ్యాధులు సోకినప్పుడు ముందస్తు ప్రయోజనాలను అందిస్తుంది.
స్పెషల్ ఎగ్జిట్ వ్యాల్యూ:
పాలసీ గడువు ముగియకముందే పాలసీ నుండి నిష్క్రమించి, చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది (ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా).
ప్రీమియం బ్రేక్ ఆప్షన్ :
మూడు సంవత్సరాల పాలసీ పూర్తయిన తర్వాత, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి, 12 నెలల పాటు ప్రీమియం చెల్లింపులను నిలిపివేసే సౌకర్యం ఉంది.
ఎక్స్‌ప్రెస్ క్లెయిమ్ పేఅవుట్:
క్లెయిమ్ నమోదు చేసిన ఒక పని దినం లోపలే రూ.3 లక్షల వరకు ముందస్తు ప్రయోజనంగా చెల్లిస్తారు (నిబంధనలకు లోబడి).
చెల్లింపు ఎంపికలు:
బీమా మొత్తాన్ని ఒకేసారి, నెలవారీ వాయిదాలలో లేదా రెండింటి కలయికగా పొందే వీలు నామినీలకు ఉంటుంది.
సమీర్ బన్సాల్, పిఎన్బి మెట్‌లైఫ్ ఎమ్ డీ, సిఇఓ మాట్లాడుతూ.
"భారతదేశంలో ఇంకా 91% లైఫ్ ప్రొటెక్షన్ గ్యాప్ ఉంది. అంటే కుటుంబ భద్రతకు రూ.100 అవసరమైతే, కేవలం రూ.9 మాత్రమే బీమా చేయబడింది. ముఖ్యంగా జీతం పొందే వారు తమ బాధ్యతలు, కలలను నెరవేర్చుకుంటూనే, తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ డిజీప్రొటెక్ట్ ప్లాన్ ఎంతో సహాయపడుతుంది."అన్నారు.
సర్బవీర్ సింగ్, పాలసీబజార్ జాయింట్ గ్రూప్స్ సిఇఓ స్పందిస్తూ,
"భారతదేశంలోని మధ్యతరగతి ఉద్యోగులు తక్కువ బీమా రక్షణతో ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. డిజిటల్ పద్ధతిలో లభించే ఈ ప్లాన్ సరసమైన ధరలో, పారదర్శకంగా ఉంటుంది. పాలసీబజార్ ద్వారా టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ప్రజలకు కూడా నాణ్యమైన బీమాను చేరువ చేయడమే మా లక్ష్యం."అని అన్నారు.
పిఎన్బి మెట్‌లైఫ్ గురించి:
మెట్‌లైఫ్ అనేది అంతర్జాతీయ అనుభవం పిఎన్బి , బ్యాంక్ విశ్వసనీయతతో ఏర్పడిన సంస్థ. ఇది దేశవ్యాప్తంగా 178 శాఖలు మరియు 20,000 పైగా ప్రాంతాల్లో తన సేవలను అందిస్తోంది. ఇది భారతదేశపు అతిపెద్ద ఇన్సూరెన్స్ బ్రోకర్. 80.5 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులతో, 50కి పైగా ఇన్సూరెన్స్ భాగస్వాములతో కలిసి పారదర్శకమైన బీమా సేవలను అందిస్తోంది.
