
ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Gaddamidi Naveen
7 ఫిబ్రవరి, 2026
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 10 నుంచి 15 రోజుల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయా శాఖల వారీగా సమీక్షలు పూర్తి చేసి, నివేదికలను సిద్ధం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసి శాఖాధిపతులతో బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే, మంత్రులందరితో కలిసి బడ్జెట్ తుది రూపకల్పనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ప్రజా సంక్షేమం, గ్యారెంటీల అమలుకు పెద్దపీట వేస్తూ ఈసారి బడ్జెట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
