Let's talk: editor@tmv.in
ఈ నెల 26న హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన

ఈ నెల 26న హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన

Gaddamidi Naveen
18 జులై, 2026

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మహిళా మేధావులతో నిర్వహించనున్న 'యుగానుకూల మాతృత్వం' అనే ఇంటరాక్టివ్ సదస్సులో ఆయన పాల్గొంటారని విశ్వమాంగల్య సభ జాతీయ నిర్వాహక కార్యదర్శి వృషాలి జోషి శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

మహిళా సాధికారత, కుటుంబాల బలోపేతం, మాతృత్వ రక్షణ, సామాజిక చైతన్యం కోసం గత 16 ఏళ్లుగా తమ సంస్థ కృషి చేస్తోందని వృషాలి జోషి తెలిపారు. నా మాతుః పర దైవతం' (తల్లిని మించిన దైవం లేదు) అనే నినాదంతో పనిచేస్తున్న ఈ సంస్థతో దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది మహిళలు అనుసంధానమై ఉన్నారని పేర్కొన్నారు.

జూలై 26న హైదరాబాద్‌లో జరిగే ఈ సదస్సులో మోహన్ భగవత్ ప్రసంగిస్తారని, అలాగే దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులతో మహిళా ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చిస్తారని తెలిపారు. నేటి ఆధునిక కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యత, పిల్లల పెంపకం, సంప్రదాయాలు-ఆధునికత మధ్య సమన్వయం వంటి పలు సవాళ్లపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.

ట్యాగ్‌లు
MohanBhagwatRSSHyderabadContemporaryMotherhoodYugankulMatrutvaWomenEmpowermentWomenLeadershipMotherhoodFamilyValues
ఈ నెల 26న హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన - Tholi Paluku