Let's talk: editor@tmv.in
ఈ నెల 25న ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు జాబ్ మేళా

ఈ నెల 25న ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు జాబ్ మేళా

Gaddamidi Naveen
20 ఆగస్టు, 2026

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో, 'మెడ్ ప్లస్' గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉదయం 11 గంటలకు భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ ఇంటర్వ్యూలు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న UEIGB-MCC కార్యాలయంలో జరుగుతాయని బ్యూరో చీఫ్ టీ. రాము ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్ మేళా ద్వారా మెడ్ ప్లస్ సంస్థలో 100 ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

విద్యార్హతలు:

డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు

వేతనాలు:

ఫార్మసిస్ట్ పోస్టుకు నెలకు రూ.25,000 వరకు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టుకు నెలకు రూ.16,000 వరకు వేతనం అందించబడుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 25న తమ విద్యార్హతల ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరోకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు మెడ్ ప్లస్ హెచ్ఆర్ సాయి శైలేష్ (ఫోన్ నెంబర్: 9666662481) ను సంప్రదించవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు.