
ఈ ఏడాది అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధించాం: ఇస్రో చైర్మన్ నారాయణన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 200కి పైగా ముఖ్యమైన మైలురాళ్లను ఇస్రో నమోదు చేసిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. 2025లో భారత అంతరిక్ష రంగం అసాధారణ పురోగతిని సాధించిందన్నారు. నారాయణన్ గురువారం బెంగళూరులో జరిగిన ఎమర్జింగ్ సైన్స్, టెక్నాటజీ అండ్ ఇన్నోవేషన్ కాన్ క్లేవ్–2025 లో పాల్గోని మాట్లాడారు. రాబోయే కాన్ క్లేవ్ ప్రధానంగా అంతరిక్ష సాంకేతికతలపై దృష్టి సారించి, బహుళ వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందింస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని నాయకత్వంలో జీ–20 శాటిలైట్ ను కూడా జీ20 దేశాలకు ఇచ్చామన్నారు. సౌత్ ఏషియాన్ శాటిలైట్ ను కూడా నిర్మించి ఆయా దేశాలకు ఇచ్చామన్నారు. ఈ సంవత్సరం 300 స్టార్టప్ కంపెనీలు అంతరిక్షరంగంలో పనిచేస్తున్నాయన్నారు. గగన్ యాన్ పై కూడా ఆయన మాట్లాడారు.
ప్రైవేట్ రంగంలో ప్రోత్సాహం
ఇస్రో ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లకు ఇన్–స్పేస్ ద్వారా సహకారం అందిస్తున్నది. డెవలప్‌మెంట్ నుంచి టెస్టింగ్ వరకు అన్ని దశల్లో గైడెన్స్ ఇస్తున్నట్లు నారాయణన్ తెలిపారు. భారత అంతరిక్ష రంగాన్ని వేర్వేరు సంస్థలుగా కాకుండా, ఒక దేశంగా కలిసి పని చేయాలి. దీనివల్ల సామాన్య ప్రజలకు కూడా పెద్ద లాభం కలుగుతుందన్నారు.
ఈ ఏడాది ఇస్రో చేపట్టిన ప్రాజెక్టులు
ఆదిత్య ఎల్–1 మిషన్: జనవరి 6న 10 టెరాబైట్స్ శాస్త్రీయ డేటా విడుదల, ఫిబ్రవరిలో మరొక సెట్. ఇప్పటివరకు మొత్తం 15 టెరాబైట్స్ డేటా అందుబాటులో ఉంది.
స్పేడ్ ఎక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్‌పరిమెంట్): జనవరి 16న ఇండియా మొదటి సారిగా ఆన్-ఆర్బిట్ డాకింగ్ విజయవంతం, రెండు ఉపగ్రహాలు 28,400 కి.మీ/గంట వేగంతో అంతరిక్షంలోకి ప్రవేశించాయి. దీంతో భారతదేశం ప్రపంచంలో ఈ సాంకేతికత సాధించిన నాల్గవ దేశంగా నిలిచింది.
జీఎస్లీవీ– ఎఫ్15 లాంచ్: జనవరి 29న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 100వ భారీ మిషన్ ను ప్రవేశపెట్టింది.
నిసార్ ఉపగ్రహం: జూలై 30న నాసా–ఇస్రో సహకారంలో లాంచ్, ఎల్-బాండ్ (నాసా) ఎస్-బాండ్ (ఇస్రో) రాడార్‌తో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మిషన్.
మూడవ లాంచ్ ప్యాడ్: తమిళనాడు లో రూ.400 కోట్ల బడ్జెట్‌తో కొత్త లాంచ్ ప్యాడ్ ఆమోదం పొందింది.
