
ఈసీఐఎల్లో 160 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
తొలిపలుకు, విద్య, ఉద్యోగం:* భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), యువ ఇంజనీర్లకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాజెక్టులలో పనిచేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన 160 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో) ఉత్తీర్ణతతో పాటు ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అకడమిక్ మార్కులు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,000 నుండి రూ.30,000 వరకు జీతంతో పాటు అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లు, మార్క్ షీట్లు, ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ECIL అధికారిక వెబ్సైట్ ecil.co.inలో ఉన్న నోటిఫికేషన్ను పూర్తిగా చదవండి.
