Let's talk: editor@tmv.in
ఇస్రో గగన్ యాన్ మెయిన్ పారాచ్యూట్ పరీక్ష విజయవంతం

ఇస్రో గగన్ యాన్ మెయిన్ పారాచ్యూట్ పరీక్ష విజయవంతం

Pinjari Chand
13 నవంబర్, 2025

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్ యాన్ మిషన్ క్రూ మాడ్యూల్ కోసం ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచ్యూట్ ఎయిర్‌డ్రాప్ టెస్ట్ ను బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షను బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో నవంబర్ 3న నిర్వహించారు.

పారాచ్యూట్ సిస్టమ్‌లో మొత్తం 10 పారాచ్యూట్లు ఉంటాయి. ప్రారంభంలో రెండు ఎపెక్స్ కవర్ సెపరేషన్ పారాచ్యూట్లు కవర్‌ను తొలగిస్తాయి, తదుపరి రెండు డ్రాగ్ పారాచ్యూట్లు మాడ్యూల్‌ను స్థిరపరుస్తాయి. మూడు పైలట్ పారాచ్యూట్లు ప్రధాన పారాచ్యూట్లను తీసుకువెళ్తాయి, చివరగా మూడు ప్రధాన పారాచ్యూట్లు మాడ్యూల్‌ను నెమ్మదిగా ల్యాండింగ్ చేస్తాయి. ప్రధాన పారాచ్యూట్లు రిఫ్‌డ్ ఇన్ఫ్లేషన్ ప్రక్రియ ద్వారా ముందుగా పాక్షికంగా తెరుచుకొని, తరువాత పూర్తిగా విస్తరిస్తాయి. ఈ పరీక్షలో రెండు ప్రధాన పారాచ్యూట్ల డిస్‌రిఫింగ్ లో పూర్తిగా తెరుచుకుంటాయి. ఈ పరిస్థితిని సిమ్యులేట్ చేసి, సిస్టమ్ లోడ్ నిర్మాణ స్థిరత్వాన్ని పరీక్షించారు.

ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఎల్-76 విమానం నుంచి 2.5 కిలోమీటర్ల ఎత్తులో క్రూ మాడ్యూల్ మాస్ వదిలారు. ఇస్రో ప్రకటన ప్రకారం పారాచ్యూట్ సిస్టమ్ యథాక్రమంగా పనిచేసిందని, సీక్వెన్స్ గా పూర్తి అయింది. ఈ విజయంతో హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్ కోసం పారాచ్యూట్ సిస్టమ్ సర్టిఫికేషన్ దిశగా ఇస్రో మరో మైలురాయి చేరుకుంది. పరీక్షలో వీఎస్ఎస్సీ , ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఆర్డీఈ), డీఆర్డీవో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ కూడా పాల్గోన్నాయి.

గగన్ యాన్ మిషన్‌లో పారాచ్యూట్ పాత్ర

గగన్ యాన్ లో ఉన్న క్రూ మాడ్యూల్ అంటే అంతరిక్షానికి వ్యోమగాములను తీసుకెళ్లే, తిరిగి భూమికి తీసుకువచ్చే ప్రధాన భాగం.

అంతరిక్ష ప్రయాణం మూడు దశల్లో

• ప్రయోగ దశ – రాకెట్ (ఎల్వీఎం–3) నుంచి క్రూ మాడ్యూల్‌ను కక్ష్యలోకి పంపడం.

• కక్ష్య దశ – అంతరిక్షంలో కొన్ని రోజులు భూమి చుట్టూ తిరగడం.

• రీఎంట్రీ దశ – మిషన్ పూర్తయ్యాక క్రూ మాడ్యూల్ తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలోనే పారాచ్యూట్ పని మొదలవుతుంది

పారాచ్యూట్ ఎందుకు అవసరం?

భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో క్రూ మాడ్యూల్ చాలా వేగంగా (సుమారు 7.5 కీ.మీ/సెకన్) కిందికి వస్తుంది. వాతావరణ ఘర్షణ వల్ల వేడి, ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వేగంలో నేరుగా క్రూ ల్యాండ్ కావడం సురక్షితం కాదు. అందుకే పారాచ్యూట్ సిస్టమ్ ను ఉపయోగిస్తారు.

పారాచ్యూట్ ఎలా పనిచేస్తుంది?

మొదట రెండు చిన్న పారాచ్యూట్లు (అపెక్స్ కవర్ సెపరేషన్ పారాచ్యూట్స్) కవర్‌ను విడదీస్తాయి.

తరువాత రెండు డ్రోగ్ పారాచ్యూట్లు మాడ్యూల్‌ను స్థిరపరచి వేగాన్ని తగ్గిస్తాయి.

తరువాత మూడు ఫైలట్ పారాచ్యూట్లు పెద్ద పారాచ్యూట్లను బయటకు లాగుతాయి.

చివరగా మూడు మెయిన్ పారాచ్యూట్లు పూర్తిగా విస్తరించి, మాడ్యూల్ వేగాన్ని చాలా వరకు తగ్గిస్తాయి (20–30 కీ.మీ/గంటకు). దీంతో వ్యోమగాములు సురక్షితంగా సముద్రంలో లేదా భూమిపై ల్యాండ్ అవుతారు.

ఇప్పుడు చేసిన ఐమ్యాట్ టెస్ట్ ఎందుకు ?

ఈ టెస్ట్ ద్వారా ఇస్రో పారాచ్యూట్లు అన్ని పరిస్థితుల్లో సరిగ్గా పనిచేస్తాయా? లేకుంటే ఒక పారాచ్యూట్ విఫలమైనా మిగిలినవి సరిపోతాయా? భూమిపై సురక్షితంగా దిగుతుందా? ఈ టెస్ట్‌లో ‘అసమాన డిస్‌రిఫింగ్’ పరిస్థితిని సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించారు.

ఇస్రో గగన్ యాన్ మెయిన్ పారాచ్యూట్ పరీక్ష విజయవంతం - Tholi Paluku