Let's talk: editor@tmv.in
ఇళ్లు మంజూరు.. నా పరిధిలోనిది కాదు

ఇళ్లు మంజూరు.. నా పరిధిలోనిది కాదు

Pinjari Chand
16 సెప్టెంబర్, 2025

కేంద్రమంత్రి సురేశ్ గోపి ఇటీవల పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సయమంలో ఓ పెద్ద మనిషి దరఖాస్తు తీసుకువచ్చి తనకు ఇంటిని మంజూరు చేయాలని కోరారు. అయితే ఆ దరఖాస్తును ఆయన తీసుకోవడానికి నిరాకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. నెటిజన్లు కామెంట్లతో సురేశ్ గోపి పై విరుకుపడ్డారు. ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఈ విన్నపాన్ని తిరస్కరిస్తావా అంటూ కామెంట్లు చేశారు.

తాజాగా ఆయన దీనిపై ఫేస్ బుక్ వివరణ ఇస్తూ నేను ఎలాంటి పనులు చేయగలను, ఎలాంటి హామీలు నెరవేర్చగలను అనే విషయాలు నాకు స్పష్టంగా తెలుసు. ఈనెల 12న వేలాయుధన్ అనే పెద్దమనిషి తనకు ఇంటిని మంజూరు చేయమని కోరారు. అయితే ఈ అంశం నా పరిధిలోనిది కాదు. అందుకే దరఖాస్తును తిరస్కరించానని వివరించారు. అలాగే తనకంటూ ఒక స్పష్టత ఉందని, చేయలేని పనులలో హామీ ఇవ్వలేనని స్పష్టం చేశారు. అనవసరంగా ఆయనకు ఆశలు కల్పించి మోసం చేయాలేనన్నారు. అయితే కొంతమంది ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇది సరైంది కాదని, తమ పనులను విరమించుకోవాలని సూచించారు. అయితే ఈ వీడియో వైరల్ కావడం వల్ల ఆ పెద్దమనిషికి ఇల్లు ఇవ్వడానికి ముందుకు రావడం సంతోషమని, దీని వెనుక ఏ ఉద్దేశ్యాలు ఉన్న ఆయనకు సొంత రావడం స్వాగతించదగిన పరిణామం అన్నారు. ప్రజా సమస్యల విషయంలో రాజకీయాలకు తావులేదని వివరించారు.

ఇళ్లు మంజూరు.. నా పరిధిలోనిది కాదు - Tholi Paluku