
ఇది 'ఫేక్, రివిజన్' బడ్జెట్.. ప్రతి కుటుంబంపై రూ. 9 లక్షల అప్పు: కవిత
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఇది ఒక "ఫేక్, రివిజన్ ప్యాబ్రికేటెడ్" బడ్జెట్ అని ఆమె అభివర్ణించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ, బడ్జెట్‌లోని లోపాలను ఎండగట్టారు.
గతేడాది కేటాయించిన రైతుభరోసా, చేయూత పింఛన్ల నిధులన్నీ అక్షరం మార్చకుండా ఇదే విధంగా కొత్త బడ్జెట్‌లో పెట్టడం వల్ల ప్రభుత్వం కనీసం విజన్ కూడా చూపలేదని, అందుకే దీనిని రివిజన్ బడ్జెట్ అని మోసపూరితంగా పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం మంది ఉన్న బీసీలకు కేవలం 4 శాతం నిధులు కేటాయించడం అసమర్థత అని చెప్పి కవిత ఘాటుగా విమర్శించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆమె తీవ్రమైన విమర్శలు వ్యక్తం చేశారు. దాదాపు 8.64 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసి ఒక్కో కుటుంబంపై సగటున 9 లక్షల రూపాయల భారాన్ని మోపడం వల్ల ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని, ముఖ్యమంత్రి తరచుగా “మోడీ బడే భాయ్” అంటూ ఢిల్లీకి వెళ్లినా కేంద్రం నుంచి ఏ ఒక్క రూపాయి రావడం లేదని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో తెలంగాణకు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీని సలీం ఫేక్ నటుడితో పోల్చుతూ, ఆయన ఇచ్చిన హామీలు ఫేక్ మాత్రమేని, అందువలన రాహుల్ గాంధీకి “రాహుల్ ఫేక్” అని నామకరణం చేస్తున్నట్లు కవిత చెప్పారు. సలీం ఫేక్ తన మాటలతో ప్రజలను నవ్విస్తే, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను ఏడిపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. బీసీలకు రూ. 20 వేల కోట్లు ఇస్తామని చెప్పి, బడ్జెట్‌లో కేవలం 4 శాతం నిధులే కేటాయించడం బీసీలను వంచించడమేనని ధ్వజమెత్తారు.
బడ్జెట్‌లో తెలంగాణ ఉద్యమకారులను, మహిళలను, నిరుద్యోగులను పూర్తిగా విస్మరించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2,500 ఇస్తామన్న హామీ ఈసారి కూడా పత్తా లేదని, ఇందిరమ్మ ఇళ్లకు రూ. 7 వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు పెరుగుతోందని, ముఖ్యంగా మహిళల్లో ఇది 50 శాతంగా ఉండటం ఆందోళనకరమని అన్నారు. స్కిల్ యూనివర్సిటీలో కేవలం 960 మంది చేరితే, 64 వేల మంది అని ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
స్త్రీ నిధి విభాగంలో గత 14 ఏళ్లుగా అక్రమాలకు పాల్పడుతున్న జి. విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తిని వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క దీనిపై విచారణ జరిపించాలని కోరారు. మొత్తంగా ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందని, కేవలం కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే నిధులు కేటాయించారని కవిత విమర్శించారు.
