Let's talk: editor@tmv.in
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

Pinjari Chand
15 సెప్టెంబర్, 2025

ఆర్టీసీ బస్సుల కంటే అధ్వానంగా మారాయి విమానాలు. ఎప్పుడు ఏదో ఓ కారణంతో నిలిచిపోతుంటాయి. ఇటీవల తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో అధికారులు చెన్నైలో విమానాన్ని నిలిపివేశారు. అయితే తాజాగా లక్నో నుంచి ఢిల్లికి వెలుతున్న సమయంలో ఇండిగో విమానంలో రన్​ వే నుంచి టేకాఫ్​ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని పక్కకు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ విమానంలో సమాజ్​ వాది ఎంపీ డింపుల్​ యాదవ్​ తో సహ 151 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా మరో విమానంలో వారి గమ్యస్థానాలకు పంపుతామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు.