
ఇక.. నగరంలో ట్రాఫిక్ క్లియర్!
హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ సమస్యలను తగించడానికి, ప్రగతిశీల మౌలిక సదుపాయాలు అందించేందుకు హైటెక్ సిటీ పథకంలో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో మౌలిక ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సంబంధిత ప్రాజెక్టుల ప్రగతిని పరిశీలించేందుకు ప్రత్యక్షంగా పర్యటించారు. కమిషనర్ అధికారులను ఉద్దేశించి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి, పనుల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం కలిగి ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు ప్రధాన జంక్షన్ల వద్ద విస్తృతంగా ఫ్లైఓవర్లు అండర్ పాసులు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ఫ్లైఓవర్‌లు మొత్తం పొడవు 4.6 కిలోమీటర్లు, అండర్ పాస్‌లు మొత్తం పొడవు 2.8 కిలోమీటర్లుగా ఉందని తెలిపారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, ప్రజలకు సురక్షితమైన మరియు వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు రోజువారీ ప్రయాణాల్లో వారి విలువైన సమయాన్ని ఆదా చేసే అవకాశం, హైదరాబాద్ మౌలిక వృద్ధిలో మరింత ముందుకు సాగుతుందని అలాగే కేబీఆర్ పార్క్ పరిసరాలు మరింత శుభ్రంగా, శాంతియుతంగా మారబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు పర్యావరణనికి హాని కలిగించకుండా, సమతుల్యతతో అభివృద్ధి జరగాలని కమిషనర్ స్పష్టం చేశారు. అన్ని పనులు ప్రజా అవసరాలు, భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పనులు సాగాలని కమిషనర్ అధికారులకు సూచించారు.
