Let's talk: editor@tmv.in
ఇంకా..ప్రభుత్వం మొద్దు నిద్రలోనే: కేటీఆర్

ఇంకా..ప్రభుత్వం మొద్దు నిద్రలోనే: కేటీఆర్

Gaddamidi Naveen
17 సెప్టెంబర్, 2025

హైదరాబాద్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాలాలలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను మూడు రోజులైనా గుర్తించలేరు. ఇంతకన్నా అసమర్థతత, చేతకానితనం,పరిపాలనా వ్తెఫల్యం ఇంకోటి ఉంటదా?.అంటూ రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉందని, ఇది ఘోరమైన చేతకానితనం అని కేటీఆర్ విమర్శించారు.

చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానవత్వం లేని కాంగ్రెస్ కు వినిపించడం లేదా. చిన్న పాటి వర్షానికే పొంగిపోర్లుతున్న నాలాలు చివరికి ప్రజల ప్రాణాలు పోతుంటే మున్సిపల్ మంత్రిగా కూడా ఉండి ఏం చేస్తున్నట్టు అని రేవంత్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ మీ కాంగ్రెస్ సర్కారు ఘోర తప్పిదం వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి మరణించిన ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశావు. అలాగే ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆరుగురిని వ సమాధి చేసి ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారు.. నాలాల్లో బలిచేసిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

ఇంకా..ప్రభుత్వం మొద్దు నిద్రలోనే: కేటీఆర్ - Tholi Paluku