Let's talk: editor@tmv.in
‘ఇందిరమ్మ మహిళా శక్తి’కి ప్రభుత్వం భరోసా

‘ఇందిరమ్మ మహిళా శక్తి’కి ప్రభుత్వం భరోసా

Gaddamidi Naveen
1 అక్టోబర్, 2025

తెలంగాణ రాష్ట్రం సామాజిక సంక్షేమ రంగంలో కొత్త చైతన్యం జోడిస్తున్న "ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి" పథకంలో భాగంగా మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టు యంత్రాలు పంపిణీ చేయడం ప్రారంభించింది. ఈ కార్యక్రమం తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హబీబ్ ఫాతిమా నగర్ కమ్యూనిటీ హాల్, హైదరాబాదులో ఘనంగా ప్రారంభమైంది, కమ్యూనిటీ వర్గ మహిళలకు ప్రత్యక్షంగా ప్రయోజనం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా సహకార మంత్రులు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకట్ స్వామి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మొదటి దశలో 10,490 కుట్టు యంత్రాలు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మైనారిటీ మహిళలకు పంపిణీ చేయాలని నిర్ణయించబడిందని తెలిపారు.రెండవ దశలో 33,750 యంత్రాల పంపిణీకి ప్రభుత్వ ఆమోదం లభించిందన్నారు.

హైదరాబాదు జిల్లాలో మాత్రమే 3,500 యంత్రాల పంపిణీకి ప్రత్యేక అనుమతి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు వంటి మైనారిటీ వర్గాల మహిళలు, పిల్లలు, విడాకులు తీసుకున్నవారు, అనాథలు, వితంతువులు మొదలైన సామాజికంగా వెనుకబడిన సమూహాలకు ఇది ముఖ్య ఆశగా.వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాక, వారి ఆదాయాన్ని పెంచే ఒక సాధనంగా భావిస్తున్నారని తెలిపారు. అలాగే గత 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ బాకీ కార్డులు పోస్టర్ విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరేలా కార్యక్రమలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు,అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ,మీర్జా రహమత్ బెగ్ ఖాద్రి మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్,ఓబెదుల్లా కొత్వాల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్,అజ్మేతుల్ల హూస్సేనీ ఇతర ప్రముఖ నేతలు, అధికారులు చురుకుగా పాల్గొన్నారు. యంత్రాల పంపిణీ కార్యక్రమం ద్వారా మహిళలు స్వయం ఉద్యోగసాధకతకు దిశానిర్దేశం అవుతుదన్నారు. శిక్షణలతో పాటు ఇలాంటి పథకాలు వారికి జీవిత మార్గాలను నిచ్చే అవకాశం కల్పిస్తాయని. ప్రభుత్వం దీన్ని ఉత్తమంగా అమలు చేసి, సమర్థ పంపిణీతో వివిధ వర్గాల మధ్య సమానత్వాన్ని పెంచాలని ప్రజా వర్గాలు ఆశిస్తున్నాయని పేర్కొన్నారు.

‘ఇందిరమ్మ మహిళా శక్తి’కి ప్రభుత్వం భరోసా - Tholi Paluku