
ఇండో–పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన 12వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు జరిగిన ఈ సమావేశంలో ఇండో–పసిఫిక్ ప్రాంతం శాంతియుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆసియాన్ దేశాలతో పాటు భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, రష్యా, అమెరికా తదితర దేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ప్రాంతీయ భద్రత, నిబంధనల ఆధారిత వ్యవస్థ కొనసాగడానికి ఆసియాన్ ఆధ్వర్యంలోని వేదికల పాత్ర కీలకమని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి పరిరక్షణకు ఈ వేదిక ప్రధాన స్తంభంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు స్వేచ్ఛగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు .
భారత్ ప్రకటించిన కొత్త కార్యాచరణలు
ఆసియాన్–భారత్ సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం, 2026–2030 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రెండు కీలక కార్యక్రమాలను భారత్ ప్రకటించింది
• సమాజ సేవ బలగాల్లో మహిళల భాగస్వామ్యం పెంపు, అందుకు అనుగుణంగా శిక్షణ, అవకాశాల విస్తరణ.
• భద్రతా పరిశోధన సంస్థల పరస్పర ఐక్యం
• పరిశోధన, విధాన రూపకల్పనలో పరస్పరం జ్ఞాన మార్పిడి.
భారత్ నాయకత్వంపై ఆసియాన్ దేశాల ప్రశంసలు
భారతదేశ ప్రణాళికను ఇండో–పసిఫిక్ వివిధ దేశ రక్షణ మంత్రులు అభినందించారు.మలేషియా రక్షణ మంత్రి భారత్‌ను బాధ్యతాయుత శక్తిగా ప్రశంసించగా, ఫిలిప్పీన్స్ మంత్రి అంతర్జాతీయ చట్టాల పట్ల భారత్ కట్టుబాటును కొనియాడారు. కంబోడియా, సింగపూర్, థాయ్‌లాండ్ ప్రతినిధులు భారత్‌తో సంయుక్త కార్యక్రమాలు, రక్షణ ఉత్పత్తి పెంచాలని సూచించారు.సమావేశం అనంతరం సింగపూర్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, వియత్నాం ప్రతినిధులతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. రక్షణ, సముద్ర భద్రత, సాంకేతిక సహకారంపై చర్చించారు. ప్రత్యేకంగా సింగపూర్‌తో సైబర్ భద్రత, సంయుక్త దళాల సాధనపై విస్తృత చర్చలు జరిపారు. అదేవిదంగా ఏసియన్ ప్రాంతం భారత్ విదేశాంగ వ్యూహంలో ప్రధాన స్థానమని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. వాణిజ్య సంబంధాలకే పరిమితం కాకుండా, స్వతంత్రం, పారదర్శకత, పరస్పర గౌరవం వంటి విలువల ఆధారంగా సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ఏసియన్ దేశాలు భారత్‌తో కలిసి రక్షణ సాంకేతికతల అభివృద్ధి, ఉత్పత్తిలో భాగస్వామ్యం కావాలని ఆయన ఆహ్వానించారు.
తూర్పు దేశాలతో బంధాలు బలోపేతం
ఆసియాన్ దేశాలతో సంబంధాల బలోపేతమే భారత తూర్పు వైపు విధానానికి ప్రధాన బలమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. వాణిజ్యానికి మించి పరస్పర గౌరవం, స్వతంత్రత వంటి విలువలే రెండు వర్గాల అనుబంధానికి కీలకమన్నారు.దేశంలో స్వయం ఆధారిత కార్యక్రమం కింద రక్షణ రంగంలో సంయుక్త పరిశోధన, ఉత్పత్తి అవకాశాలను ఆసియాన్ దేశాలు వినియోగించుకోవచ్చని సూచించారు.సమావేశంలో ఇటీవల అమెరికాతో కుదిరిన పది సంవత్సరాల రక్షణ ఒప్పందాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీని వలన సాంకేతిక విజ్ఞానం, సమాచార మార్పిడిలో పురోగతి సాధించవచ్చని తెలిపారు.
కీలక ప్రతిపాదనలు
• ఇండో–పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, నిబంధనల ఆధారంగా ఉండాలి
• ఆసియాన్ ఆధ్వర్యంలోని భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలి
• మహాసాగర్ దృష్టి పథకంతో సముద్ర భద్రతకు మద్దతు
• సంయుక్త రక్షణ ఉత్పత్తి, పరిశోధనలో భాగస్వామ్యం
• మహిళల శాంతి భద్రత కార్యక్రమాలు పై దృష్టి
15 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సమ్మిట్ ఈ సమావేశంతో విశ్వాసం పెరిగిందని, ఐక్యతే ఆసియాన్‌కు అత్యుత్తమ రక్షణ సాధనమని మలేషియా మంత్రి అభిప్రాయపడ్డారు.
