
ఇండియా ‘ఏ’ జట్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో కీలకమైన టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త! గాయం నుంచి స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడు. నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న సఫారీలతో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతున్న పంత్.. రీఎంట్రీలో భారత్-ఏ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరగనున్న రెండు అనధికారిక రెడ్-బాల్ (నాలుగు రోజుల) మ్యాచ్‌ల సిరీస్‌కు రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ మంగళవారం రెండు జట్లను ప్రకటించింది. ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరగనుంది.
పంత్‌కు కీలకమైన ప్రాక్టీస్
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో కాలికి గాయమైన పంత్, ఆ తర్వాత ఆసియా కప్, వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనలకు దూరమయ్యాడు. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో గాయపడ్డా, పంత్ పట్టుదలతో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. సర్జరీ అవసరం లేకుండా ఆరు వారాల విశ్రాంతి తీసుకున్న పంత్‌కు, దక్షిణాఫ్రికాతో జరిగే ప్రధాన టెస్ట్ సిరీస్‌కు ముందు ఈ 'ఏ' సిరీస్ మెరుగైన మ్యాచ్ ప్రాక్టీస్ కానుంది.
రెండు 'ఏ' జట్లకు కెప్టెన్ పంత్
సెలక్టర్లు ప్రకటించిన రెండు 'ఏ' జట్లకు పంత్ సారథ్యం వహించనున్నాడు. యువ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను రెండు మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్‌గా నియమించారు.
భారత్ ‘ఏ’ జట్టు - తొలి మ్యాచ్
రిషభ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, ఎన్. జగదీశన్ (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మనవ్ సుతార్, అంషుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, అయుష్ బదోని, సరంశ్ జైన్.
భారత్ ‘ఏ’ జట్టు – రెండో మ్యాచ్
రిషభ్ పంత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ధృవ్ జురేల్ (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మనవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
రెండో మ్యాచ్‌లో ఆడనున్న కెఎల్ రాహుల్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (అక్టోబర్ 25న ముగింపు) తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి 'ఏ' జట్టులో చేరతారు.
దక్షిణాఫ్రికా జట్టులో టెంబా బవుమా
ఈ సిరీస్‌లో భారత్-ఏతో తలపడే దక్షిణాఫ్రికా-ఏ జట్టులో ఆ దేశ టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా కూడా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న బవుమా.. భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ఇక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి 'ఏ’ జట్టు తరపున ఆడనున్నారు. దక్షిణాఫ్రికా 'ఏ' జట్టుకు మార్కేస్ అకర్మాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ ప్రాక్టీస్ సిరీస్ అనంతరం భారత్-దక్షిణాఫ్రికా మధ్య ప్రధాన టెస్ట్ సిరీస్ నవంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది.
