
ఇంటెలిజెన్స్ ఎందుకు విఫలమైంది ? అఖిలేశ్ యాదవ్ ప్రశ్న
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలో, ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించే ప్రాంతంలోనే ఇలాంటి ఘటన జరగడం అత్యంత ఆందోళనకరమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. మన రాజధానిలో ఇంత పెద్ద పేలుడు ఎలా జరిగింది? ప్రతి సారి ఇంటెలిజెన్స్ ఎందుకు విఫలమవుతుంది? ప్రధానమంత్రి గారూ, ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారో దేశానికి చెప్పండి అని ఆయన విమర్శించారు. అలాగే దేశ భద్రతకోసం దళాలు కూడా నిరంతరం శ్రమిస్తున్నాయని కొనియాడారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేయాలని కోరారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి. వారిని దేశం నుంచి తరిమేయాలి. ప్రజలకు న్యాయం చేయాలన్నారు. దేశంలో ఇన్ని సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి ఏవిధంగా ఫెయిలైందని విమర్శించారు.
ముందు దర్యాప్తు జరగాలి..తర్వాతే మాట్లాడతా: సీఎం సిద్ధరామయ్య
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం. కానీ దర్యాప్తు పూర్తయ్యాకే వ్యాఖ్యానించడం సముచితం. పేలుడు వెనుక ఉన్న ఉద్దేశం, కుట్రలు వెలుగులోకి రావాలని అన్నారు.
నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు బీహార్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బాంబు పేలుళ్లు ఎక్కడైనా జరిగితే అది మానవాళికి నష్టం. అమాయకులు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ ఘటనలో కనీసం 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై ఉప, ఎక్స్ ప్లోజివ్ యాక్ట్, అలాగే భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కోట్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
బాధితులను పరామర్శించిన గవర్నర్, సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆమె ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించి, వారికి ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషాద సంఘటనపై దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలతో కలిసి, దర్యాప్తు జరుగుతోందన్నారు. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, దోషులను చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు.
