Let's talk: editor@tmv.in
ఇంగ్లాండ్ చేతిలో ఓడినా ..మహిళల హాకీ వరల్డ్ కప్‌కు భారత్ అర్హత

ఇంగ్లాండ్ చేతిలో ఓడినా ..మహిళల హాకీ వరల్డ్ కప్‌కు భారత్ అర్హత

Pinjari Chand
15 మార్చి, 2026

ఇండియా ఉమెన్స్‌ నేషనల్ ఫీల్డ్ హాకీ జట్టు, ఇంగ్లాండ్ ఉమెన్స్ నేషనల్ ఫీల్డ్ హాకీ టీంతో జరిగిన ఫైనల్లో 0–2 తేడాతో ఓడిపోయినా మహిళల హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ ఫైనల్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. మ్యాచ్ 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన గ్రేస్ బాల్స్డన్ ఇంగ్లాండ్‌కు తొలి ఆధిక్యం అందించింది. తర్వాత 43వ నిమిషంలో ఫీల్డ్ స్ట్రైక్ ద్వారా ఎలిజిబెత్‌ నియల్‌ మరో గోల్ సాధించడంతో ఇంగ్లాండ్ ఆధిక్యం 2–0కి పెరిగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న భారత జట్టు మొత్తం 60 నిమిషాల పాటు కఠినంగా పోరాడినా ఇంగ్లాండ్ డిపెన్స్‌ను ఛేదించలేకపోయింది. అయితే ఈ టోర్నమెంట్ నుంచి చాంపియన్ ఇంగ్లాండ్‌తో పాటు రన్నరప్ భారత్, అలాగే స్కాట్లాండ్ ఉమెన్స్‌ నేషనల్‌ ఫీల్డ్ హాకీ టీం వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి. స్కాట్లాండ్ జట్టు ఇటలీ ఉమెన్స్ నేషనల్‌ ఫీల్డ్‌ హకీ టీంను 1–0 తేడాతో ఓడించి అర్హత పొందింది. ఈ ఏడాది మహిళల హాకీ వరల్డ్ కప్‌ను నెదర్లాండ్, బెల్జియం సంయుక్తంగా నిర్వహించనున్నాయి.