
ఇంగ్లండ్ మెన్స్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకటన
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) 2025, 2026 సీజన్ కోసం మెన్స్ జట్టు సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 30 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టులు కేటాయించగా, 14 మందికి రెండేళ్లు, 12 మందికి ఒక ఏడాది, నలుగురికి డెవలప్‌మెంట్ కాంట్రాక్టులు లభించాయి. టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు సెప్టెంబర్ 30, 2027 వరకు రెండేళ్ల ఒప్పందం దక్కడం, 2027 ఇంగ్లండ్ ఆషెస్‌లోనూ ఆడతానన్న ఆయన సంకల్పానికి స్పష్టమైన సంకేతం ఇది.
మొదటిసారి సెంట్రల్ కాంట్రాక్టు సాధించిన ఐదుగురు యంగ్ ప్లేయర్లు, సోనీ బేకర్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, ల్యూక్ వుడ్. డెవలప్‌మెంట్ కాంట్రాక్టుల్లో ఎడ్డీ జాక్, టామ్ లాస్, మిచెల్ స్టాన్లీ కొత్తగా చేరగా, జాష్ హల్ జాబితాలో కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్ మెన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ మాట్లాడుతూ.. మల్టీ ఫార్మాట్ ఆటగాళ్లకు రెండేళ్ల ఒప్పందాలతో వర్క్‌లోడ్ బ్యాలెన్స్ చేస్తున్నాం. వైట్‌బాల్ స్పెషలిస్టులకు లాంగ్ టర్మ్ డీల్స్ ఇచ్చి, ఫ్రాంచైజీ లీగ్ షెడ్యూల్ మధ్య ఇంగ్లండ్ ప్రాధాన్యతను నిలబెట్టాం. ఈ నిర్మాణంతో అన్ని ఫార్మాట్లలో బలమైన స్క్వాడ్‌లను కాపాడుకుంటాం’ అని ధీమా వ్యక్తం చేశారు.
రెండేళ్ల కాంట్రాక్టులు (30-09-2027 వరకు):
జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, జాస్ బట్లర్, బ్రైడన్ కార్స్, శామ్ కుర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్, బెన్ స్టోక్స్, జాష్ టంగ్.
ఒక ఏడాది కాంట్రాక్టులు (30-09-2026 వరకు):
రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, జాక్ క్రాలీ, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, ఆలీ పోప్, మాథ్యూ పాట్స్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్, మార్క్ వుడ్.
డెవలప్‌మెంట్ కాంట్రాక్టులు:
జాష్ హల్, ఎడ్డీ జాక్, టామ్ లాస్, మిచెల్ స్టాన్లీ.
ల్యాప్స్ అయినవి:
జానీ బెయిర్‌స్టో, జాక్ లీచ్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆలీ స్టోన్, రీస్ టాప్లీ, క్రిస్ వోక్స్, జాన్ టర్నర్. స్టోక్స్ రెండేళ్ల డీల్‌తో 2027 ఇంగ్లండ్ ఆషెస్ డ్రీమ్‌కు గ్రీన్ సిగ్నల్, యంగ్ బ్లడ్‌కు బంపర్ ఛాన్స్, ఈసీబీ ప్లాన్‌తో ఇంగ్లండ్ మెన్స్ టీమ్ ఇక ఆల్ ఫార్మాట్ ధూంధాంకు రెడీ.
