Let's talk: editor@tmv.in
ఆ.. రైతుల్ని జైల్లో వేయండి: సుప్రీం కోర్టు

ఆ.. రైతుల్ని జైల్లో వేయండి: సుప్రీం కోర్టు

Pinjari Chand
18 సెప్టెంబర్, 2025

ఢిల్లీ, హర్యానా, పంజాబ్ తదితర ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనానికి పాల్పడుతున్న రైతులపై సుప్రీం కోర్టు బుధవారం సీరియస్ అయింది. దహనం చేసేవారిని కొంత మందిని జైల్లో వేస్తేనే మిగతా వారు దారికొస్తారని ఆగ్రహించింది. పంట వ్యర్థాలపై దాఖలైన పిటిషన్ పై తాజాగా విచారణ జరిపింది. రైతులు ప్రత్యేకమైన వారే కావచ్చు. వారి వల్లే అందరికీ భోజనం దొరుకుతుంది.అలాగని పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే చూస్తు ఉండలేం కదా అని ప్రశ్నించింది. ఈ మధ్య పంట వ్యర్థాల దహనాలకి బయో అయిల్స్ వాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని వల్ల పర్యావరణం మరింత దెబ్బతింటుంది. వాతావరణంలో గాలి నాణ్యత పడిపోతుంది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని వారిపై చర్యలు తీసుకోండి అని కీలక వ్యాఖ్యలు చేసింది.

రైతులకు సబ్సీడీలు ఇస్తున్నాం

పంటకాలం అయిపోయిన తరువాత రైతులు వ్యర్థాలను దహనం చేయకుండా ఉండటానికి వివిధ పరికరాలు సబ్సిడీ కింద ఇస్తున్నట్లు అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ సుప్రీం కోర్టుకు తెలిపింది. విమానాలు, ఉపగ్రహాలు ఆయా ప్రాంతాల్లో వెళ్లినప్పుడు మాత్రమే కాల్చ వద్దని చెప్పారని, మిగతా సమయాల్లో వ్యర్థాలను తగులబెట్టవచ్చని అధికారులు చెప్పినట్లు రైతులు చెబుతున్నట్లు తెలిపారు. ఎన్నిసార్లు ప్రభుత్వ నిబంధనలు తెలియజేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుందని వాపోయారు. దీంతో సుప్రీం అసహనం వెలిబుచ్చింది. రైతులపై జరిమానా వేయండి లేదా కొందరిని జైలుకైనా పంపితేనే మార్పు వస్తుందని తెలిపింది.

ఆ.. రైతుల్ని జైల్లో వేయండి: సుప్రీం కోర్టు - Tholi Paluku