
ఆసియా కప్ ట్రోఫీ విషయంలో గందరగోళం
ఛాంపియన్ భారత జట్టికి ఇంకా అందించలేకపోయిన ఆసియా కప్ ట్రోఫీపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసిసిలో ఇంకా లాక్ కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ నుంచి ఏసిసి అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని వదులుకోవడానికి నిరాకరిస్తూ, భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ నుంచి మళ్ళి వచ్చిన అభ్యర్థనను తిరస్కరించాడు. ఈ అభ్యర్థనకు అఫ్ఘానిస్తాన్, శ్రీలంక క్రికెట్ బోర్డులు మద్దతు పలికాయి.
ఏసిసిలో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం, బీసీసీఐ రాజకీయ కార్యదర్శి, ఏసిసిలో బీసీసీఐ ప్రతినిధి రాజీవ్ శుక్ల, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్ బోర్డుల ప్రతినిధులు గత వారం ఏసిసి అధ్యక్షుడికి ట్రోఫీని భారత్‌కు అందించాలని కోరిన లేఖ రాశారు. కానీ, నఖ్వీ స్పందనలో బీసీసీఐ నుంచి ఎవరైనా దుబాయ్‌లోని ఏసిసి హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చి ట్రోఫీ తీసుకువెళ్లాలని బలవంతంగా చెప్పాడు. దీన్ని బీసీసీఐ తిరస్కరించడంతో పరిస్థితి మారలేదు. బీసీసీఐ తన నిలబాటును స్పష్టం చేస్తూ, అతని నుంచి ట్రోఫీని స్వీకరించమని చెప్పింది. కాబట్టి, ఈ అంశం త్వరలో జరిగే ఐసిసి సమావేశంలో చర్చకు వస్తుందని అధికారిక ప్రకటన.
ట్రోఫీ ప్రదానోత్సవ సమయంలో భారత జట్టు ప్లేయర్‌లు నఖ్వీ నుంచి దాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో అతడు ట్రోఫిని తీసుకుని వెళ్లిపోయాడు. ఇది క్రికెట్ చరిత్రలోనే అనోకోని సంఘటన. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా, ఆ దేశ ఇంటీరియర్ మంత్రిగా నఖ్వీ పనిచేస్తు ఇలాంటి పణులకి పాలుపడడం సిగ్గు చేటు అని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.
పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన వారి పట్ల గౌరవంగా, మూడు వారాల టోర్నీలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఏ మ్యాచ్ తర్వాత కూడా హ్యాండ్‌షేక్ జరగలేదు. ఈ టోర్నీలో రెండు జట్లు ప్రతి ఆదివారం ఒకరినొకరు ఎదుర్కొన్నాయి. ప్రతి లీగ్‌లోను భారత జట్టు పాక్ టీమ్ మీద చాలా సునాయాసంగా గెలిచేసింది. న్యాయంగా గెలిచిన ట్రోఫీని ఇవ్వకుండా ఇలా దాచిపెట్టుకోవడం ఎంత వరకు సరి అయినది కాదు అని అందరి అభిప్రాయం. ఇక ఈ రచ్చ ఎప్పటి వరకు సాగుతుందో చూడాలి మరి.
