
ఆసియా కప్‌లో అసలు మజా షురూ
ఆసియా కప్ 2025లో గ్రూప్ మ్యాచ్‌లు ముగిశాయి. నేటి నుంచి సూపర్ 4 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఈ దశకు చేరుకున్నాయి. యుఏఈలో జరిగే ఈ మ్యాచ్‌ల కోసం ఆసియా వ్యాప్తంగా క్రికెట్ ప్రియులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరిగే ఫైనల్ కోసం పోటీలు మరింత జోష్‌గా మారబోతున్నాయి. ఈ దశలో ప్రతి మ్యాచ్ టెన్షన్‌తో నిండి ఉంటుందని నిపుణులు అంచనా.
సూపర్ ఫోర్‌కు.. అఫ్ఘానిస్తాన్ ఔట్!
అబుదాబీలో అఫ్ఘానిస్తాన్‌పై శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో గెలిచి సూపర్ ఫోర్‌కు చేరింది. 170 రన్స్ లక్ష్యాన్ని 8 బాల్స్ మిగిలిఉండగానే టార్గెట్‌ను ఛేదించారు. కుసల్ మెండిస్ 74 రన్స్ నాటౌట్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా జట్టును విజయం వైపు నడిపించాడు. ఒత్తిడిలోనూ శ్రీలంక కాస్త శాంతంగా ఆడటం గమనార్హం. బౌలింగ్‌లో నువాన్ తుషారా 4/18తో అఫ్ఘాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. అఫ్ఘానిస్తాన్‌కు మొహమ్మద్ నబీ 22 బంతుల్లో 60 రన్స్‌తో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన అతడు ఆ తర్వాత స్లో ఇన్నింగ్స్ ఆడి 169కే ఆలౌట్ అయ్యాడు. ఈ ఓటమితో అఫ్ఘాన్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. దీంతో బంగ్లాదేశ్ సూపర్ ఫోర్‌కు క్వాలిఫైయర్స్‌కు సిద్ధమైంది.
సెప్టెంబర్ 21న దాయాదుల పోరు
గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ ఫోర్‌కు చేరాయి. ఈ రెండు జట్ల మధ్య పోరు టోర్నీలో అత్యంత ఆసక్తికరమైనదిగా మారబోతుంది. మరీ ముఖ్యంగా ‘హ్యాండ్ షేక్’ కాంట్రవర్సీ తర్వాత అస్సలు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో అని క్రికెట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది . సెప్టెంబర్ 21న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. భారత్, పాకిస్తాన్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ మ్యాచ్‌ను చూస్తారు. సూపర్ ఫోర్ దశలో ఈ పోరు హైలెట్ గా మారడం ఖాయం.
కొందరు మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ పై మాట్లాడారు. పాకిస్తాన్ లెజెండ్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ ‘పాక్ భారత్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదు’ అని వ్యాఖ్యానించారు. భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా, ‘ఫైనల్ వరకు భారత్ స్థిరత్వం పరీక్షించబడుతుంది’ అని అన్నాడు. ఫీల్డ్ వెలుపలి ఈ వాదనలు మ్యాచ్‌ను మరింత ఉత్తేజకరంగా మారుస్తున్నాయి.
సూపర్ ఫోర్ ఫార్మాట్
సాధారణ నాకౌట్ లకు భిన్నంగా, సూపర్ ఫోర్‌లో రెండు గ్రూపుల్లో టాప్ టీమ్‌లు ఒకే పూల్‌లో కలిసి ఆడతాయి. ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు రౌండ్ రాబిన్ విధంగా ఆడుతుంది. పాయింట్ల టేబుల్‌లో టాప్ 2 జట్లు ఫైనల్‌కు చేరతాయి. సూపర్ ఫోర్ దశలో పాయింట్ల విభజన విధానం ఇలా ఉంటుంది: మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి, డ్రా లేదా నో రిజల్ట్‌లో ముగిస్తే రెండు జట్లకు తలా ఒక పాయింట్ దక్కుతుంది, ఓడిపోతే పాయింట్లు ఇవ్వరు. మ్యాచ్‌లు సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు దుబాయ్, అబుదాబీలో జరుగుతాయి.
సూపర్ ఫోర్ కు ఫుల్ షెడ్యూల్
• సెప్టెంబర్ 20 : శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్, రాత్రి ఎనిమిది గంటలకు(భారత కాలమానం ప్రకారం), వేదిక: దుబాయి
• సెప్టెంబర్ 21 : భారత్ వర్సెస్ పాకిస్థాన్, రాత్రి ఎనిమిది గంటలకు(భారత కాలమానం ప్రకారం), వేదిక: దుబాయి
• సెప్టెంబర్ 23 : పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక, రాత్రి ఎనిమిది గంటలకు(భారత కాలమానం ప్రకారం), వేదిక: అబుదాబి
• సెప్టెంబర్ 24 : భారత్ వర్సెస్ బంగలదేశ్, రాత్రి ఎనిమిది గంటలకు(భారత కాలమానం ప్రకారం), వేదిక: దుబాయి
• సెప్టెంబర్ 25 : పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్, రాత్రి ఎనిమిది గంటలకు(భారత కాలమానం ప్రకారం), వేదిక: దుబాయి
• సెప్టెంబర్ 26 : భారత్ వస శ్రీలంక, రాత్రి ఎనిమిది గంటలకు(భారత కాలమానం ప్రకారం), వేదిక: దుబాయి
• సెప్టెంబర్ 28 : ఫైనల్స్, రాత్రి ఎనిమిది గంటలకు(భారత కాలమానం ప్రకారం), వేదిక: దుబాయి
ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిది!
ఆసియా కప్ 2025లో ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదే. సూపర్ 4 దశలో ఏ జట్టు కూడా మ్యాచ్‌ను నెమ్మదిగా మొదలుపెట్టేందుకు వీలు లేదు. ఎందుకంటే నెట్ రన్ రేట్ చాలా కీలకం. ఏ మాత్రం తప్పు జరిగినా ఫైనల్ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. భారత్ పాక్ మ్యాచ్ షోస్టాపర్ అయినా, భారత్ శ్రీలంక, పాక్ బంగ్లా మ్యాచ్‌లు కూడా విపరీతమైన హైప్ ను మోస్తున్నాయి. మెండిస్ నేతృత్వంలో శ్రీలంక యువ జట్టు, ఆసియా బెస్ట్‌లతో పోటీ పడుతుంది. బంగ్లాదేశ్ ఫైటింగ్ స్పిరిట్‌తో దుబాయ్‌లో పోటీకి సవాల్ విసురుతోంది. దుబాయ్, అబుదాబీలో జరిగే ఈ మ్యాచ్‌లు ఈ ఏడాది అత్యంత థ్రిల్లింగ్ గా క్రికెట్‌ను అందజేస్తాయని ఖాయం.
