Let's talk: editor@tmv.in
ఆర్బీఐ నివేదికలో మెరిసిన ఆంధ్రప్రదేశ్

ఆర్బీఐ నివేదికలో మెరిసిన ఆంధ్రప్రదేశ్

Panthagani Anusha
16 డిసెంబర్, 2025

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా వివిధ కీలక రంగాలలో తన ప్రత్యేకతను చాటుకుంది. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య రంగంతో పాటు ఆర్థికాభివృద్ధి, జీవితకాల సూచికల్లో కూడా రాష్ట్రం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో పండ్ల ఉత్పత్తిలో ఏపీ 1.9 కోట్ల టన్నులతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మామిడి, బత్తాయి, బొప్పాయి, నిమ్మ వంటి ముఖ్యమైన పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దాదాపు అన్ని విభాగాల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. పండ్ల తోటల సాగు విస్తీర్ణంలో సైతం రాష్ట్రం రెండో స్థానంలో ఉంది.

మత్స్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. సుమారు 51 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. కాగా మత్స్య సంవర్ధకంలో (ఆక్వాకల్చర్) దేశవ్యాప్తంగా రాష్ట్రం వాటా 40 శాతానికి పైగా ఉండటం విశేషం. విస్తారమైన తీర ప్రాంతం, గోదావరి-కృష్ణా నదుల నీటి వనరులు, సారవంతమైన మట్టి ఈ రంగాల అభివృద్ధికి ప్రధానంగా తోడ్పడ్డాయని నివేదిక పేర్కొంది.

ఆర్థిక రంగంలో కూడా రాష్ట్రం స్థిరమైన పురోగతిని సాధించింది. 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)రూ. 16 లక్షల కోట్లకు చేరినట్లు అంచనా. వ్యక్తిగత స్థూల ఉత్పత్తి (పర్ క్యాపిటల్ ఇన్కమ్)రూ.2.5 లక్షలకు పైగా నమోదు కావడం రాష్ట్ర ప్రజల ఆదాయ స్థాయి మెరుగుపడుతున్న దానికి సూచికగా ఉంది. జీవితకాల సూచికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో సగటు జీవిత కాలం 70 ఏళ్లుగా నమోదైంది, ఇది దేశ సగటుతో సమానంగా ఉంది. పురుషుల జీవిత కాలం 68 ఏళ్లు కాగా మహిళల ఆయుర్దాయం 73 ఏళ్లుగా ఉండటం మహిళల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయని సూచిస్తోంది.

ఇక, ఇతర సూచికలను పరిశీలిస్తే... విద్యుత్ వినియోగం పరంగా రాష్ట్రం జాతీయస్థాయిలో 14వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో వ్యక్తికి దాదాపు 1,500 యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉండటం అభివృద్ధి వేగాన్ని ప్రతిబింబిస్తోంది. అదేవిదంగా సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ అమలులో రాష్ట్రం 74 స్కోరుతో దేశంలో 10వ స్థానాన్ని దక్కించుకుంది. రైతులు, మత్స్యకారుల కృషి, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు, ఆధునిక సాంకేతికతల వినియోగం వంటి అంశాలు రాష్ట్ర విజయానికి ప్రధాన కారణాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బహుముఖ రంగాలలో స్థిరంగా కొనసాగుతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నివేదిక ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక రంగాలలో స్థిరమైన పురోగతిని నమోదు చేసింది. వ్యవసాయ రంగంలో (పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండడానికి రైతు భరోసా పతాకం ఉపయోగ పాడగా మత్స్యరంగంలో (ఇన్‌లాండ్ ఆక్వాకల్చర్ వృద్ధి) బలమైన పనితీరును కనబరిచింది, అయినప్పటికీ సహజ విపత్తులు, మార్కెట్ ధరలు ఈ రంగాలకు సవాళ్లుగా మిగిలాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సేవల రంగం (45 శాతం) వ్యవసాయ రంగం (32 శాతం) పరిశ్రమ రంగం (23శాతం) వాటాలతో స్థిరంగా కొనసాగింది. విద్యుత్ రంగంలో పునర్వినియోగ శక్తిపై దృష్టి ఉన్నప్పటికీ ట్రాన్స్‌మిషన్ నష్టాల కారణంగా రాష్ట్రం 14వ స్థానంలో ఉంది. ఆరోగ్య రంగంలో వైఎస్సార్ ఆరోగ్య పథకాలు,షణ కార్యక్రమాల ఫలితంగా జీవన కాలం పెరిగింది, మహిళల ఆయుష్షు 73 సంవత్సరాలుగా నమోదైంది. మొత్తం మీద కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కీలక రంగాల్లో సాధించిన స్థిర పురోగతి కారణంగా ఆంధ్రప్రదేశ్ సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ దేశవ్యాప్తంగా బలమైన అభివృద్ధి రాష్ట్రంగా నిలించిందని ఆర్బిఐ వెల్లడించిన నివేదిక స్పష్టం చేస్తోంది.