
ఆర్థిక వ్యవస్థపై కేంద్రం వాస్తవ విరుద్ధ ప్రకటనలు చేస్తోంది: జైరాం రమేష్
కేంద్రంలో ప్రధానమంత్రి, ఆయన కేబినేట్ లోని మంత్రులు భారత ఆర్థికవ్యవస్థపై వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేష్ బుధవారం విమర్శించారు. కేంద్రప్రభుత్వం ప్రజల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా రైతులకు కేంద్రం అనేక పథకాలు, మద్దతు కల్పించిందని చెప్పుకుంటోంది. కానీ అందుకు వ్యతిరేకంగా మార్కెట్లో రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు ఉంటున్నాయన్నారు. రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోదని ఎద్దేవా చేశారు. ప్రధాని, ఆయన సహచర మంత్రులు లేనిదీ ఉన్నట్లు కనికట్టు చేస్తున్నారని ఆరోపించారు. మొక్కజొన్న, సోయాబీన్, కందులు, పత్తి, పెసరపప్పు, సజ్జలు తదితర పంటల ధర కనీస మద్దతు ధర కంటే మార్కెట్ లో తక్కువగా ఉన్నాయని తెలిపారు.
అందుకే రైతు సంఘాలు ఎంఎస్పీ కి చట్టబద్ధమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. రైతుల డిమాండ్ కు గతంలో ఉపరాష్ట్రపతిగా పని చేసిన ధన్ ఖడ్ కూడా మద్దతిచ్చారని గుర్తు చేశారు.
మద్ధతు ధర కంటే మార్కెట్లో తక్కువ ధరలు
మార్కెట్లో ప్రస్తుతం మొక్కజొన్నకు మద్దతు ధర - 2,400, మార్కెట్ ధర - 2,200. బజ్రా - రూ.2,775, మార్కెట్ ధర రూ.2,100. కందులు రూ.8,000, మార్కెట్ ధర రూ.7,000. మొక్కజొన్న రూ.8,768, మార్కెట్ ధర రూ.6,500. పత్తిరూ. 7,710, మార్కెట్ ధర రూ.7,000. సోయాబీన్ రూ.5,328, మార్కెట్ ధర రూ.4,100 ఉందని ఆయన వెల్లడించారు.
అక్టోబర్ 11న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ ) స్లాబ్‌ల తగ్గింపు వలన రైతులకు చాలా ఎక్కువగా లబ్ది పొందుతున్నారని, ట్రాక్టర్లతో సహా వ్యవసాయ పరికరాలపై వారు పెద్దమొత్తాన్ని ఆదా చేస్తున్నారని తెలపడంతో జైరాం రమేష్ ఈ వివరాలను తెలిపారు. అలాగే కేంద్రం పప్పు దినుసులను, తదితర పంటలను పండిచాలని చెబుతుంది. కానీ మద్దతు కల్పించడం లేదన్నారు.
