Let's talk: editor@tmv.in
ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

Gaddamidi Naveen
8 అక్టోబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న బస్సు చార్జీల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దేవిరెడి సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ పాల్గొన్నారు. తాము కూడా బస్సు టికెట్లు తీసుకుని సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ, ప్రజల అభిప్రాయాలను ప్రత్యక్షంగా వినేందుకు వచ్చామన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రయాణంలో భాగంగా పలువురు ప్రయాణికులు టికెట్ ధరలపై అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు.అలాగే ప్రయాణికులకు నెలకు సుమారు రూ.500 వరకు అదనపు భారం పడుతోందని వాపోయారు.

చార్జీల పెంపుతో మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తనున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్, నగర‑బస్సుల్లో చార్జీలు రూ.5 నుంచి రూ.10 కిపెంచారని, ఇది 6 అక్టోబర్ 2025 నుంచి అమలులోకి వచ్చిందన్నారు. అదేవిధంగా బస్ బస్‌పాస్‍ చార్జీలు 20శాతం పెంచారని ప్రభుత్వాన్ని విమర్శించారు. బస్సులో ప్రయాణికులు కూడా ఎమ్మెల్యేల నిరసనకు మద్దతుగా నినాదాలు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం "చార్జీల పెంపుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు, "పేదల మీద భారం వేయద్దు" అని ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిరసనలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యల పట్ల చొరవ చూపుతుందని పేర్కొన్నారు. టికెట్ ధరల భారం పేద ప్రజల జీవన ప్రమాణాన్ని ప్రభావితం చేస్తోందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గమనించి తగిన చర్యలు తీసుకోవాలన్నది ప్రజల కోరికగా ఎమ్మెల్యేలు ఈ నిరసనగా తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ ఇటీవల బస్సు చార్జీలను, బస్ పాస్ ధరలను పెంచింది. ఈ పెరుగుదల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సులు,బస్ పాస్ లకువర్తిస్తుంది. కొత్త చార్జీలు, పాత చార్జీల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

తాజాగా పెరిగిన బస్సు చార్జీలు 2025

*బస్ పాస్ రకం

పాత ధర

కొత్త ధర*

ఆర్డినరీ బస్ పాస్

రూ.1,150

రూ.1,400

మెట్రో ఎక్స్ ప్రెస్

రూ.1,300

రూ.1,600

మెట్రో డీలక్స్

రూ.1.450

రూ.1,800

గత చార్జీలు పెంపు కి ముందు పరిస్థితి 2022 లో

2022 మార్చిలో టీఎస్ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ)ఒక రూ.5 అదనపు రుసుము ఛార్జీ విధించింది.

ఆ జారీ ప్రకారం, పాస్‌లలో కూడా పెంపు జరిగింది.

*బస్ పాస్ రకం

పాత ధర

కొత్త ధర*

ఆర్డినరీ బస్ పాస్

రూ.950

రూ.1,150

మెట్రో ఎక్స్ ప్రెస్

రూ.1,070

రూ.1,600

మెట్రో డీలక్స్

రూ.1.185

రూ.1,450

ఈ బస్సు చార్జీల పెంపుకు అనేక కారణాలు ఉన్నాయి. ఉదా: మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడం. అయితే ఈ పెంపు మహిళల కంటే పురుఘలపై మాత్రమే భారం మోపుతుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - Tholi Paluku