Let's talk: editor@tmv.in
ఆర్జేడీ పాలన చీకటి యుగం:జేపీ నడ్డా

ఆర్జేడీ పాలన చీకటి యుగం:జేపీ నడ్డా

Pinjari Chand
6 నవంబర్, 2025

బీజేపీ జాతీయ అధ్యక్షుడు,కేంద్ర మంత్రి జేపీ నడ్డా బుధవారం బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్టంలో ఒకప్పుడు "అంధేరా యుగ్" (చీకటి యుగం) ఉండేదని, కానీ ఇప్పుడు 24 గంటల విద్యుత్ సరఫరా అందుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. కనీసం మొబైల్ చార్జ్​ పెట్టుకోవడానికి కూడా ఇబ్బందులు పడేవారు. ఆర్జేడీ అసలు రూపం ఇంకా మారలేదు. అలాగే ఉంది. ఆ పార్టీ డీఎన్ఏ ఇంకా మారలేదని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ దాదాగిరి చేస్తోంది. జంగిల్ రాజ్యం మళ్లీ తీసుకురావాలని చూస్తున్నారు. షాబుద్దీన్ కుమారుడికి ఆర్జేడీ టికెట్ ఇచ్చింది. బీహార్ లో అభివృద్ధిని లాలూ ప్రసాద్ అడ్డుకున్నారు. లాలూ–రబ్రీ కాలంలో జంగిల్ రాజ్యం నడిచింది. కానీ ఇప్పుడు మోడీ వల్ల నితీశ్ హయాంలో ఎక్స్ప్రేస్ వేలు వచ్చాయి. సుమారు 30 వేల కిలోమీటర్ల మేర రోడ్లు వచ్చాయి. ఈఎన్నికల్లో ఎన్డీయేకు బలమైన మద్దతు ఇవ్వండి. మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. మోడీని విమర్శించి మహఘట్బంధన్ దేశాన్ని కూడా విదేశాల్లో పదే పదే విమర్శిస్తున్నారు. అలాగే ఓట్ చోరీ జరిగిందని అంటున్నారు. మరి ఎస్ఐఆర్ తీసుకొస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు వద్దంటున్నారు. ఎస్ఐఆర్ తో చోరబాటుదారులను పంపించేస్తాం.

ఎన్డీయే అంటే హీరా, హైవేస్, ఇంటర్నెట్, రైల్వేస్, ఎయిర్‌పోర్ట్స్. ఇవే అభివృద్ధికి చిహ్నాలు. ఇప్పడు ఏవిధంగా రోడ్లు వేగంగా అభివృద్ది చెందుతున్నాయో మీరు చూస్తున్నారు. బక్సర్ నుంచి భగల్ పూర్ వరకు రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. పట్నా–పూర్ణియా నేషనల్ హైవే 9 ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇవ్వన్నీ గుర్తుంచుకోవాలని ప్రజలను కోరారు. ఒకప్పుడు బీహార్‌లో రోజుకు కేవలం రెండు గంటలే కరెంట్ ఉండేది, కానీ ఇప్పుడు 24 గంటలు నిరంతర విద్యుత్ అందుతుంది అని పేర్కొన్నారు. నితీశ్ పాలనను మనం బేరీజు వేసుకోవాలంటే చీకటీ యుగంలో గడిపిన రోజులు కూడా మనం మననం చేసుకోవాలని గుర్తు చేశారు.

రాహుల్ గాంధీపై కిరెన్ రిజిజు విమర్శ

కేంద్ర మంత్రి కిరెన్ రిజిజూ హర్యానాలో ఓట్ల దోపిడీ జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. హర్యానా విషయం బీహార్ ఎన్నికల దృష్టి మరల్చడానికేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో విజయం–పరాజయం రెండింటినీ అంగీకరించాలి. కానీ రాహుల్ గాంధీ ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా వస్తే ప్రశంసిస్తారు. ప్రతికూలంగా వస్తే మీడియాను, ఎన్నికల సంఘాన్ని నిందిస్తారు. ఇది సరైన విధానం కాదు అన్నారు. హర్యానా కాంగ్రెస్ ఓటమికి కారణం తమ నేతలేనని, వారు నేలమీద పని చేయలేదని రిజిజూ తెలిపారు. కుమారి సెల్జా, రావు నరేందర్ సింగ్ వంటి నాయకులే కాంగ్రెస్ అంతర్గత గొడవలను అంగీకరించారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఓట్లు దొంగిలించబడ్డాయి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని ఆయన అన్నారు.