Let's talk: editor@tmv.in
ఆర్జేడీ పాలనలో శాంతిభద్రతలు ఉండవు: పీఎం మోదీ

ఆర్జేడీ పాలనలో శాంతిభద్రతలు ఉండవు: పీఎం మోదీ

Pinjari Chand
25 అక్టోబర్, 2025

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాటల వేడి పెరిగింది. ఆర్జేడీపై ఎన్డీయే నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.అగ్రనాయకులు బీహార్ కు వరుసకట్టారు.గతంలో ఆర్జేడీ పాలనలో జరిగిన విషయాలను గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టింది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. సమస్తీపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఆర్జేడీ పాలనలో చట్టాలు, శాంతి భద్రతలు అంటూ ఏమి ఉండవు. జంగిల్ రాజ్ పాలన సాగిస్తుందని తెలిపారు. ఆ పార్టీకి రాష్ట్ర యువత భవిష్యత్ కంటే కుటుంబ నాయకుల రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని ఆరోపించారు.మహాఘట్బందన్ కు, ఆర్జేడీకి కుటుంబమే ముఖ్యమని తెలిపారు.గతంలో బలవంతంగా భూ కబ్జాలు, హత్యలు, కిడ్నాపులు జరిగాయని, దీంతో బీహార్ ను నాశనం చేశారన్నారు. వీరి వల్ల నా అక్క చెల్లెళ్లు, నా దళితులు, వెనుకబడిన వర్గాలు, అత్యంత అణగారిన కులాలు తీవ్రంగా వేదనకు గురయ్యాయని, వీరికి పోలీస్ స్టేషన్లు తెరుచుకునేవి కావాన్నారు.

ఆర్జేడీ పాలనలో నక్సలిజం, మావోయిస్టుల ఉగ్రవాదం పెరిగిందని, 12 జిల్లాలకంటే ఎక్కువ ప్రాంతాలు ప్రభావితమైనాయని, ఎన్డీయే 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజాన్ని, మావోయిస్టులను తొలగించేస్తున్నామన్నారు. వారి వ్యవస్థను పూర్తిగా ధ్వసం చేస్తున్నాం. మరికొన్ని రోజుల్లో ఉగ్రవాదం అనేదే ఉండదన్నారు. బీహార్‌‌ ను వారి చెరనుంచి విడిపించి అభివృద్ధిలోకి వచ్చేలా చేస్తున్నామన్నారు. 'హర్ ఏక్ కే హాత్ మే లైట్ హై తో లాంతర్ (ఆర్జేడీ గుర్తు ) చాహియే క్యా?'..." అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను మోడీ ప్రశంసిస్తూ, 2005లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీ బీహార్ లో జరుగుతున్న ప్రభుత్వ పనులకు అడ్డంకులు సృష్టించారని, ఏ పని జరిగినా వ్యతిరేకంగా వ్యవహరించారని అన్నారు. ఇప్పుడు ఎన్డీయే పాలనలో బీహార్‌కు మూడు రెట్లు ఎక్కువ ఫండ్స్ వచ్చాయని,రాష్ట్రంలో నలుమూలాల కొత్త రహదారులు, రైల్వే లైన్‌లు, వందే భారత్ రైళ్లు, విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తున్నామని గుర్తుచేశారు

. సమస్తిపూర్ నుంచి పూర్ణియా వరకు ఆరు లేన్ల రహదారిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్నికలలో విజయం పై ఆశాభావం వ్యక్తం చేస్తూ నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే గత రికార్డులను బద్దలు కొడుతుందని, భారీ మెజార్టీ సాధిస్తుందని మోదీ పేర్కొన్నారు. ప్రజా నాయకుడు కర్పూరి ఠాకూర్ స్పూర్తితో, మేం సుపరిపాలనను అందిస్తున్నాం. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ ఏం చెబుతున్నాయో, ఏం చేస్తున్నాయో నాకంటే మీకే బాగా తెలుసు. నేను మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తులు వేల కోట్ల విలువైన కుంభకోణాలు చేసి బెయిల్‌పై ఉన్నారు.ఇప్పుడు వారు కర్పూరి ఠాకూర్ బిరుదును దొంగిలించడంలో నిమగ్నమై ఉన్నారు. ప్రజా నాయకుడు కర్పూరి ఠాకూర్‌కు జరిగిన ఈ అవమానాన్ని బీహార్ ప్రజలు ఎప్పటికీ సహించరని అన్నారు.

బీహార్‌లో నవంబర్ 6,11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న వస్తాయి.

ఆర్జేడీ పాలనలో శాంతిభద్రతలు ఉండవు: పీఎం మోదీ - Tholi Paluku