Let's talk: editor@tmv.in
ఆర్‌జేడీ నాయకులు జంగిల్‌రాజ్ పాఠశాల విద్యార్థులు:ప్రధాని మోడీ

ఆర్‌జేడీ నాయకులు జంగిల్‌రాజ్ పాఠశాల విద్యార్థులు:ప్రధాని మోడీ

Pinjari Chand
7 నవంబర్, 2025

బీహార్‌లో ఆర్‌జేడీ నాయకులు జంగిల్‌రాజ్ పాఠశాలలో చదువుకున్నవాళ్లని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా విమర్శించారు. ఆ పాఠశాల పేరు A అంటే అపహరణ, F అంటే ఫిరోతి(కిడ్నాప్ చేసి డబ్బు అడగడం), R అంటే రంగ్ దారి(బలవంతంగా డబ్బులు వసూలు చేయడం) నేర్పుతోంది. వీళ్ల అక్షరమాల పి అంటే కుటుంబవాదం, జీ అంటే ఘోటాలా(మోసం)తో నిండిపోయింది. ఆర్‌జేడీ కఖారా అంటే కట్టా, కటుత్వం, క్రూరత్వం, కుశాసనం, కుసంస్కారం, అవినీతి” అని ఆయన చురకలు అంటించారు.

భాగల్పూర్‌లో గురువారం జరిగిన ప్రజాసభలో ఆయన మాట్లాడుతూ బీహార్‌ లో అత్యంత అవినీతి కుటుంబం (లాలూ యాదవ్ కుటుంబం) దేశంలో అవినీతి కుటుంబం (రాహుల్ గాంధీ కుటుంబం) ఇద్దరూ అధికారంలో ఉన్నారని ఊహించండి. ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్‌ యోజన నిధులు సోదరీమణుల ఖాతాల్లో కాకుండా, వీళ్ల ఖాతాల్లోకి వెళ్లేవి అని ఎద్దేవా చేశారు. అలాగే మహాఘట్బంధన్‌లో అంతర్గత అధికార పోరు ముదురుతోందని, కాంగ్రెస్ పార్టీని ఆర్‌జేడీ “తుపాకీ తలపై పెట్టి” ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం దోచుకుందని ప్రధాని వ్యాఖ్యానించారు. కొన్నాళ్లుగా కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ పెద్దది అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆర్‌జేడీ వాళ్లు వారి అహంకారానికి సవాలు విసిరారు. తుపాకీ తలపై పెట్టి సీఎం స్థానాన్ని లాక్కున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు ప్రతీకారానికి సిద్ధమవుతున్నారని అన్నారు.

రాహుల్ గాంధీని ‘నామ్‌దార్’ అని సంబోధిస్తూ మోడీ మరోసారి ఎద్దేవా చేశారు. ఆ నామ్‌దార్‌ బీహార్‌కు రావాలనే ఇష్టం లేకుండానే వచ్చారు. బలవంతంగా తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు ఆయనే ఆర్‌జేడీకి నష్టం చేస్తున్నాడు. అధికార ప్రయోజనాల కోసం సొంత స్నేహితులను మోసం చేసే వాళ్లు బీహార్‌ మేలు కోరలేరు అన్నారు.

పర్యాటక రంగంపై దృష్టి

భాగల్పూర్ అభివృద్ధికి పర్యాటక రంగం, జల రవాణాపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని ప్రధాని తెలిపారు. గంగా నదిపై నిర్మించిన జలమార్గం భాగల్పూర్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మా ప్రభుత్వం బీహార్‌ వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. ఫిర్ ఏక్ బార్–ఎన్డీయే సర్కార్ వస్తోందన్నారు. యువత గుర్తు పెట్టుకోవాలి మీ కలలను నిజం చేయడమే మోడీ సంకల్పమన్నారు.మోడీకి ప్రజలే రాజులు, మీరే మమ్మల్ని కంట్రోల్ చేసేది. మీరే మా యజమానులు, మీరే మా కుటుంబం అన్నారు. మీ కోసం పగలు,రాత్రి కష్టపడుతున్నాం. మీ ఓటు చాలా విలువైనది. గతంలో మీ పెద్ద వాళ్లను ఆర్‌‌జేడీ జంగిల్ రాజ్యంలో బాగా ఇబ్బందులు పెట్టిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్, ఆర్‌జేడీలు మన విశ్వాసాన్ని అవమానపరుస్తున్నాయి అని మోడీ విమర్శించారు.