Let's talk: editor@tmv.in
ఆరోసారి జోడిగా షారుఖ్, దీపికా

ఆరోసారి జోడిగా షారుఖ్, దీపికా

Thaduri Lalitya
23 సెప్టెంబర్, 2025

ఒకప్పుడు బాలీవుడ్ లో హిట్ పెయిర్ ఎవరంటే ఫస్ట్ వినిపించే పేరు షారుఖ్, కాజోల్. ఇది ఒకప్పటి మాట ప్రస్తుతం మాత్రం షారుఖ్ పక్కన దీపికా ఉంటేనే ఫ్రేమ్ సూపర్ అంటున్నారు ఆడియన్స్. మరోసారి ఈ జోడి తెరపైకి వస్తే ఎలా ఉంటుందో, అని గట్టిగా అనుకున్నారామో గాని, ప్రేక్షకులు కోరిన అప్డేట్ రానే వచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్ సినిమాలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంట ఫిక్స్ అయిపోయిందంటూ బాలీవూడ్ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ హల్చల్ చేస్తుంది.

కల్కి 2898ఏడి పార్ట్ 1 తో దీపికా టాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయింది. కానీ స్పిరిట్, కల్కి 2898 ఏడి వంటి భారీ ప్రాజెక్టుల నుంచి వైదొలిగిన ఆమెకు ప్రస్తుతం ‘కింగ్’ మూవీ ఆఫర్ కీలకమైన సైన్‌గా భావిస్తున్నారు. ఓం శాంతి పఠాన్, జవాన్, హ్యాపీ న్యూ ఇయర్ వరకు ఐదు బ్లాక్‌బస్టర్స్‌లో కలిసి పనిచేసిన ఎస్ఆర్కే, దీపికా జంటకు ఇది ఆరవ చిత్రం అవుతుంది. ఇప్పటికే వీరి కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో అలరించగా, కింగ్ ద్వారా మరొకసారి ఆ మంత్రాన్ని పునరావృతం చేయబోతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ కూడా కీలక పాత్రల్లో నటించనుండగా, అభిషేక్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 2026 చివరి త్రైమాసికంలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, హై వోల్టేజ్ యాక్షన్, స్టైల్, స్టార్ పవర్ మేళవింపుతో బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికర ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది.

ఆరోసారి జోడిగా షారుఖ్, దీపికా - Tholi Paluku